Janasena vs Jagan Govt : జగన్ సర్కార్ పై జనసేన ‘బొలిశెట్టి’ సాధించిన ‘పర్యావరణ’ విజయమిదీ

Janasena vs Jagan Govt : జనసేన పర్యావరణ పరిరక్షణ విషయంలో మరోక ఘన విజయం సాధించింది. దీనిని తన భుజస్కందాల పైన వేసుకోని చివరి వరకు పోరాటం చేసి గెలుపు సాధించిన ప్రముఖ పర్యావరణవేత్త , జనసేన జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్యనారాయణకి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఇక విషయానికి వస్తే, పేదలందరికీ ఇళ్ళు పేరుతో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కబ్జా చేయటం, పేదలకు ఇళ్ళు పేరుతో అవినీతి, అక్రమాలు చేయటం పరిపాటి అయింది […]

Written By: NARESH, Updated On : November 15, 2022 3:39 pm
Follow us on

Janasena vs Jagan Govt : జనసేన పర్యావరణ పరిరక్షణ విషయంలో మరోక ఘన విజయం సాధించింది. దీనిని తన భుజస్కందాల పైన వేసుకోని చివరి వరకు పోరాటం చేసి గెలుపు సాధించిన ప్రముఖ పర్యావరణవేత్త , జనసేన జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్యనారాయణకి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

ఇక విషయానికి వస్తే, పేదలందరికీ ఇళ్ళు పేరుతో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కబ్జా చేయటం, పేదలకు ఇళ్ళు పేరుతో అవినీతి, అక్రమాలు చేయటం పరిపాటి అయింది జగన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇందులో భాగంగా యూనివర్సిటీ స్థలాలు, స్కూలు స్థలాలు, శ్మశానాలు, మడ అడవులు, అటవీ భూములు, అవభూములు అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు తీసుకోని అభివృథ్థి పేరుతో పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు.

అందులో భాగంగా కాకినాడ మడ అడవులను నాశనం చేసి, అక్కడ పేదలకు ఇళ్ళు కట్టిస్తామని మాయా ప్రకటన చేయటంతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం పైన బోలిశెట్టి సత్యనారాయణ సాక్ష్యాలతో సహ చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్ శాఖలో కేసు నెంబరు 65/2020 దాఖలు చేశారు. దీని పైన స్పందించిన ట్రిబ్యునల్ పర్యావరణ విధ్వంసం పైన ఒక కమిటీ వినియోగించటం, సదరు కమిటీ రిపోర్టు ప్రకారం తాత్కాలిక పరిరక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.

సదరు ఉత్తర్వులలోని స్థూల అంశాలు.

1) రాష్ట్ర ప్రభుత్వం కోస్తా రెగ్యులేషన్ జోన్-1 నిభంధనలు ఉల్లంఘన చేయటానికి వీల్లేదు.

2) మడ అడవులను నిభంధనలు ఉల్లంఘన చేసి విథ్వంస చేయటానికి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు చేయకూడదు.

3) రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరు ద్వారా సముద్రపాయ కి ఎటువంటి అడ్డంకులు లేకుండా, సముద్ర జలాల స్వేచ్ఛగా పారేలా చర్యలు తీసుకోవాలి.

4) పిడ్బ్ల్యూడీ మరియు కాకినాడ పోర్టు వారు సంయుక్తంగా రహదారుల పైన ఉన్న మొక్కల పెంపకం కోసం అవసరమైన రక్షణ బాక్సులు ఏర్పాటు చేసి, సముద్ర నీరు వాటికి అందేలా చర్యలు తీసుకోవాలి.

5) అంథ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 18 ఎకరాల భూమిలో జరిగిన మడ అడవుల విధ్వంసం తాత్కాలిక నష్టపరిహారం 5 కోట్ల రూపాయలతో అక్కడ మరలా మడ అడవుల నిర్మాణం కోసం వెచ్చించాలి. ఈ సోమ్ము రాష్ట్ర ప్రభుత్వం తీర్పు వచ్చిన 6 నెలల లోపు చెల్లించాల్సిన బాధ్యత ఉన్నది. అలా చెల్లించన పక్షంలో అంథ్ర ప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వారు వాటిని ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సిన బాధ్యత మరియు మడ అడవుల పెంపకం, సంరక్షణ కోసం వెచ్చించాలి.

6) అక్కడ జరిగిన పూర్తి స్థాయి పర్యావరణ విధ్వంసం పైన విచారణ తగు అథారాలతో చేసి రిపోర్టు చేయటం కోసం ఒక 6మంది నిపుణులతో కూడిన కమిటీని నియమించారు. దీనిలో జాతీయ, రాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఇతరులు సభ్యులుగా ఉంటారు. వీరు అరు నెలల లోపు పూర్తి పర్యావరణ విథ్వంసం పైన విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వం ఛీప్ సెక్రటరీకి నివేదిక ఇవ్వాలి. సదరు రిపోర్టులో విధ్వంసం ఏమేరకు జరిగింది, దాని పునరుద్ధరణకు, పరిరక్షణకు ఏంత మొత్తం నష్టపరిహారం అవసరముంది తదితర అంశాల పైన రిపోర్టు ఇవ్వాలి ఈ కమిటీ. ఈ కమిటీ రిపోర్టు ఇచ్చిన అరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సదరు కమిటీ ఇచ్చిన నష్టపరిహారం మొత్తం సోమ్ము జమ చేయాలి.

7) అంథ్ర ప్రదేశ్ కోస్టల్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ అథారిటీ వారు సదరు సోమ్ము జమ చేసిన మూడు నెలలో పర్యావరణ పునరుద్ధరణ, పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టి, కనీసం వచ్చే 5 సంవత్సరాల కాలంలో 85% పైగా మడ అడవుల పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలి.

8) సదరు కమిటీ మొత్తం అక్కడ ఉన్న 58 ఎకరాలలో మడ అడవుల పెంపకం, పరిరక్షణ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్టు చేయాలి. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం దానిని తూ.చా. తప్పక పాటించాలి.

9) కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల మార్పు కానీ, ఉల్లంఘనలు కానీ భవిష్యత్తులో కాకతాళీయ, ఉదాసీనత చేయకూడదు, చేయనీయకూడదు.

ఇలా పలు సూచనలతో పాటు, ఉల్లంఘనలపైన పరిమితులు కూడా విధిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది.

ఇది నిజంగా జనసేన పార్టీ ఘన విజయం. పార్టీ 7వ మూల సిధ్ధాంతం చక్కగా, వాస్తవంగా అమలు చేశారు. దీనిని పట్టుదలతో సాకారం చేసిన బోలిశెట్టి సత్యనారాయణ గారికి, మడ అడవుల పరిరక్షణకు స్పూర్తిని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అభినంథనలు మరియు థన్యవాదాలు.