https://oktelugu.com/

Election Fraud: ఓట్ల కోసం ఈ నేత ఓటర్ల చెవిలో ‘బంగారు పూలు’ పెట్టిందే?

Election fraud : నేతలు గెలవడానికి ఏమైనా చేస్తారు.. ఎంతకైనా దిగజారుతారు. మాటలు కోటలు దాటుతాయి. డబ్బును ఓటర్లపై ఏరులై పారిస్తారు. మద్యాన్ని పొంగిస్తారు. గెలిచాక ఓట్లేసిన వారు వస్తే.. సమస్యలపై ప్రశ్నిస్తే తన్ని తరిమివేస్తారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఎవరు ఎంత పంచితే వారిదే విజయం.. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఇది అంతగా ప్రభావం చూపకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ డబ్బు పరిపతి బాగా పనిచేస్తుంది. సర్పంచ్, కార్పొరేటర్ లాంటి పదవుల కోసం ఓటు వేలు, […]

Written By: , Updated On : February 23, 2022 / 06:31 PM IST
Follow us on

Election fraud : నేతలు గెలవడానికి ఏమైనా చేస్తారు.. ఎంతకైనా దిగజారుతారు. మాటలు కోటలు దాటుతాయి. డబ్బును ఓటర్లపై ఏరులై పారిస్తారు. మద్యాన్ని పొంగిస్తారు. గెలిచాక ఓట్లేసిన వారు వస్తే.. సమస్యలపై ప్రశ్నిస్తే తన్ని తరిమివేస్తారు.

Election Fraud

Election Fraud

ప్రస్తుతం ఎన్నికల్లో ఎవరు ఎంత పంచితే వారిదే విజయం.. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఇది అంతగా ప్రభావం చూపకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ డబ్బు పరిపతి బాగా పనిచేస్తుంది. సర్పంచ్, కార్పొరేటర్ లాంటి పదవుల కోసం ఓటు వేలు, బంగారం పంచిన వారు విజయం సాధించిన దాఖలాలున్నాయి.

డబ్బు పంచితే రాజకీయాల్లో సాధించనది ఏదీ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓటర్లకు డబ్బు, మద్యం, బంగారం ఇచ్చి వారికి బొట్టు పెట్టి ఒట్టు వేయించుకొని మరీ గెలిచిన వారు క్షేత్రస్థాయిలో బోలెడు మంది ఉన్నారు.

తాజాగా తమిళనాడులో ఏకంగా ఓటర్లకే బురిడీ కొట్టించింది ఓ కార్పొరేటర్ పోటీదారు. తమిళనాడులోని ఆంబూరులో స్థానిక ఎన్నికల్లో ఓటర్లకు గట్టి షాక్ ఇచ్చింది. 36వ వార్డులో మణిమేఘలై అనే మహిళ ఇండిపెండెంట్ గా పోటీచేసింది. తనకే ఓటెయ్యాలని 1500 మంది మహిళలకు ఒక్కో గ్రాము బంగారు నాణెం పంచింది. అందరూ ఆమె కే ఓటేశారు. దీంతో మణిమేఘలై గెలిచింది. కార్పొరేటర్ అయ్యింది.

Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?

అయితే ఓటు వేసిన తెల్లారి కొందరు ఆ కాయిన్స్ తీసుకొని దుకాణానికి వెళ్లి నగలు చేయించుకుందామని ప్రయత్నిస్తే అవన్నీ నకిలీవని తేలింది. దీంతో ఓటర్లు లబోదిబోమన్నారు.

కొసమెరుపు ఏంటంటే: పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఓటేసేందుకు డబ్బులు తీసుకోవడం నేరమని.. కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో నిండా మునిగిన ఓటర్లు మాకెందుకు ఈ బాధలు అంటూ స్టేషన్ నుంచి జారుకున్నారు. అలా నకిలీ బంగారు నాణేలు ఇచ్చి జనాలను మోసం చేసి గెలిచిన కార్పొరేటర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read: రష్యా, ఉక్రెయిన్.. ఎవరి సత్తా ఎంత? సైన్యం బలాబలాలివీ!