Chandrababu- Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తుంది..ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకి పెరిగిపోతూ వస్తున్నప్పటికీ ..ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ , జనసేనలు పటిష్టంగా లేకపోవడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ సర్వేలు చెబుతున్నాయి..ఇక టీడీపీ లేటెస్ట్ గా చేయించుకున్న సర్వేని చూసి చంద్రబాబులో భయాందోళనలు ఎక్కువ అయ్యాయని ప్రచారం సాగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి టీడీపీ కేవలం 40 నుండి 50 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందట..మరో పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం వల్ల తెలుగు దేశం పార్టీ ఓట్లు దారుణంగా చీలిపోతాయట.. ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతం మొత్తంలో జనసేన పార్టీ ఊపందుకుందని..ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 12 శాతం ఓటు బ్యాంకుని జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ సర్వే లో తేలిందట.
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం 63 స్థానాల్లో మెరుగ్గా ఉందట..అంతే కాకుండా 9 పార్లమెంట్ స్థానాల్లో ఆశాజనకంగా ఉండే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం..వీటిల్లో 40 అసెంబ్లీ స్థానాలు , 5 ఎంపీ స్థానాలను టీడీపీ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది..2019 తో పోలిస్తే మెరుగైన పరిస్థితిలోనే టీడీపీ ఉందని తేలింది.. కానీ ఆ పార్టీకి ఈసారి అధికారంలోకి రావడం అత్యవసరం..ఎందుకంటే చంద్రబాబుకి వయసు అయిపోతుంది..పార్టీలో ఉన్న నాయకులూ మొత్తం లోకేష్ వెనుక నడిచేందుకు సిద్ధంగా లేరు..అందుకే ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఎక్కువ ఉంది.. అందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో జత కట్టేందుకు చంద్రబాబు అమితాసక్తిని చూపిస్తున్నాడని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.

పవన్ కళ్యాణ్ ముందు అనేక సార్లు ఈ ప్రతిపాదన పెట్టిన చంద్రబాబు, పవర్ షేరింగ్ ఉంటేనే పొత్తు పెట్టుకుంటాము అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి గట్టిగా చెప్పాడట..అయితే దీనిపై పార్టీ లో చర్చలు జరిపి త్వరలోనే తమ నిర్ణయం తెలుపుతామని పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు చెప్పినట్టు సమాచారం..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.