The Kerala Story Announcement: నిన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’..చరిత్రకు మరో కోణమా లేక మరో వివాదమా?

The Kerala Story Announcement: కశ్మీర్లో పండిట్లపై జరిగిన హత్యాకాండ నేపథ్యంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. మొదట్లో ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ దీనిపై రాజకీయంగా వివాదం చెలరేగడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. అసలు ఈ మూవీలో ఏముంది..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి సినీ ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా సినిమాను ఆయా భాషల్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై […]

Written By: NARESH, Updated On : March 23, 2022 8:41 am
Follow us on

The Kerala Story Announcement: కశ్మీర్లో పండిట్లపై జరిగిన హత్యాకాండ నేపథ్యంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. మొదట్లో ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ దీనిపై రాజకీయంగా వివాదం చెలరేగడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. అసలు ఈ మూవీలో ఏముంది..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి సినీ ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా సినిమాను ఆయా భాషల్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సినిమాను అడ్డం పెట్టుకొని దేశంలో కొత్త సమస్య సృష్టించాలని చూస్తున్నారని కొందరు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. ఇదిలా ఉండగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ మాదిరిగానే ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ రూపుదిద్దుకుంటోంది. కేరళలో హిందువు అమ్మాయిలపై జరిగిన ఘోరాన్ని చూపించేందుకు ఈ సినిమాలో రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చరిత్రకు మరో కోణమా..? లేక మరో వివాదాన్ని రేపుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఏదైనా మరో రాజకీయ తుఫాన్ గ్యారంటీగా కనిపిస్తోంది..!

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కాశ్మీర్ పండిట్లపై దారుణాలు కళ్లకు కట్టారు. ఆ వర్గం దాడులకు కశ్మీర్ వదిలి కన్నీళ్లతో వలస వెళ్లిన వారి దైన్యాన్ని చూపించారు. ఇక్కడి హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలను చేసి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లోయలో ఉండాలంటే ముస్లిం మతం మార్చుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అలాగే చాలా మంది పండిట్లను ఊచకోత కోశారు. ఇలాంటి సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో ఈ సినిమా చూసిన వాళ్లు చలించిపోయారు.

ఇప్పుడు ఇదే కోణంలో ‘ది కేరళ స్టోరీ’ని కూడా తీయాలని రెడీ అవుతున్నారట. కేరళ రాష్ట్రంలో గత 12 ఏళ్లల్లో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ నకు గురవుతున్నారు. దాదాపు ఈ కాలంలో 32వేల మంది అపహారణకు గురైనట్లు సమాచారం. అంతేకాకుండా కొందరు ప్రేమ పేరుతో హిందువుల అమ్మాయిలను వలలో వేసుకొని, ఆ తరువాత వారి మతం మార్చారు. అంతేకాకుండా వారిని ముస్లిం వార్ జోన్స్ సిరియా, అప్ఘనిస్తాన్ వంటి దేశాలకు పంపించారు. ఈ సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను సుదీప్తో సేన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించనున్నారు.

అయితే ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై రాజకీయ వివాదం చుట్టుకుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈ సినిమాను ఓన్ చేసుకొని చూడాలని ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఈ సినిమాను చూసి బాగుందని డైరెక్టర్ అగ్నిహోత్రిని మెచ్చుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలో వినోద పన్ను రాయితీని ప్రకటించారు. అసోం లో ఈ సినిమాను చూసేందుకు హాఫ్ డే లీవ్ ను ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి కాశ్మీర్లో పాకిస్తాన్ చేసిన ఆగడాలను తెలుసుకోవాలని అంటున్నారు.

కానీ సినిమాలతో జీవితాలు మారుతాయా..? అని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన నాడు పండిట్లపై జరిగిన గాయాలు తొలిగిపోతాయా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై హాట్ కామెంట్స్ చేశారు. పండిట్లపై దారుణాలు జరిగే రోజుల్లో బీజేపీయే అధికారంలో ఉంది కదా..? అని అన్నారు. ప్రజా అవసరాలు, వారి బాగోగులను చూడాల్సింది పోయి సినిమాలు చూసి రెచ్చిపోవాలని అంటున్నారని కేసీఆర్ విమర్శించారు. మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ తో రాజకీయ వివాదం చుట్టుకోగా.. తాజాగా ‘కేరళ స్టోరీ’తో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోననే ఆందోళన అందరిలోనూ నెలకొంది. సినీ విశ్లేషకులు అంటున్నారు.