
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై తన అనుచరులకే కాకుండా తెలంగాణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కేబినెట్ నుంచి బర్త్ రఫ్ కాబడ్డ ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు. అయితే ఆయన సొంత పార్టీలోకి వెళ్తారా..? లేక ఇతర పార్టీల్లోకి వెళ్తారా..? అన్న సందేహం అందరిలో ఉంది. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ నేతలో సమావేశమైన ఈటల ఇటీవల బీజేపీ నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. అయితే బీజేపీ నేతలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని, దీంతో ఆయన కమలం పార్టీ కండువా కప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
తాజాగా ఆయన ఢిల్లీకి చెందిన ఓ ముఖ్యనేతతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి సమావేశమయ్యారు. ఇక నిన్న ఆయన కిషన్ రెడ్డితోని కలిసింది నిజమేనని ఒప్పుకున్నారు. దీంతో ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈటలకు బీజేపీ నాయకులు భారీ ఆపర్లు ఇచ్చినట్లు సమాచారం. ఆయన సతీమణికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇక టీఆర్ఎస్ పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజందర్ రాజీనామా చేయలేదు. మరోవైపు టీఆర్ఎస్ నాయకుల నుంచి అవసరమైతే రాజీనామా చేసి గెలవండి.. అంటూ ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన తరువాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయన వెంటనే పార్టీలో చేరుతారా..? కొంత సమయం తీసుకుంటారా..? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక భూ కుంభకోణం ఆరోపణలపై ఎదుర్కోవాలంటే తన వెనుక బలమైన అండ కావాలని , అందుకే బీజేపీలో చేరితే లాభిస్తుందని భావిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ పై భూ కుంభకోణ ఆరోపణలు తీవ్రమైతే కేంద్రం నుంచి టీఆర్ఎస్ నేతల్లో కొందరిపై సీబీఐ ఎంక్వైరీలు చేయించొచ్చని అనుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరితేనే లాభం ఉంటుందని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.