NTR Family -Taraka Ratna : శాపమా? పాపమా?… ఎన్టీఆర్ కుటుంబంపై పగబట్టిన మృత్యుదేవత?

NTR Family -Taraka Ratna : ఎన్టీఆర్ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. అకాలమరణాలతో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు, అనారోగ్యాలు, చివరికి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె హైదరాబాద్ లోని నివాసంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఉమామహేశ్వరి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణంగానే ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఇక రెండు రోడ్డు ప్రమాదాలు […]

Written By: NARESH, Updated On : February 19, 2023 2:54 pm
Follow us on

NTR Family -Taraka Ratna : ఎన్టీఆర్ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. అకాలమరణాలతో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు, అనారోగ్యాలు, చివరికి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె హైదరాబాద్ లోని నివాసంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఉమామహేశ్వరి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణంగానే ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది.

ఇక రెండు రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపాయి. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ కార్ యాక్సిడెంట్ లో కన్నుమూశారు. హైవే మీద ఓ ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్ గా యూ టర్న్ తీసుకున్నాడు. వేగంగా వస్తున్న జానకి రామ్ ఆ ట్రాక్టర్ ని ఢీ కొట్టారు. జానకిరామ్ అక్కడిక్కడే మృతి చెందారు. ఆ ప్రమాదం జరిగిన నాలుగేళ్లకు మరో ప్రమాదం చోటు చేసుకుంది. జానకిరామ్ తండ్రి హరికృష్ణ కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

2018 లో హరికృష్ణ చనిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య, తండ్రిని నాలుగేళ్ళ వ్యవధిలో కోల్పోయాడు. తాజాగా తారకరత్న కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు. జనవరి 27న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన్ని స్థానిక కుప్పం ఆసుపత్రికి తరలించారు. తారకరత్న పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించారు.

23 రోజులు తారకరత్న మృత్యువుతో పోరాడాడు. ఆయన్ని బ్రతికించుకొనేందుకు కుటుంబం చేయని ప్రయత్నం లేదు. వయసురీత్యా తారకరత్న ప్రధాన అవయవాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. మెదడులో సమస్య అలానే ఉండిపోయింది. ఆ కారణంగా తారకరత్న కోమాలోనే కన్నుమూశారు. పదేళ్ల వ్యవధిలో నలుగురు కుటుంబ సభ్యులు అసహజంగా మరణించారు.

ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరు ఆయన కళ్ళముందే కన్నుమూశారు. జూనియర్ ఎన్టీఆర్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పుకున్నారు. 2009 ఎన్నికల క్యాంపైన్ సమయంలో ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డారు. తారకరత్న బెడ్ పై ఉండగానే సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కారు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు… ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబంపై మృత్యుదేవత పగబట్టినట్లు పలువురు అకాల మరణాల బారినపడుతున్నారు.