Droupadi Murmu- KCR: రాజకీయ చదరంగంలో కేసీఆర్ ఆటలు అందరికి తెలిసినవే. వైపైతే ఇటు జోపుడైతే అటు అన్న చందంగా గోడ మీద పిల్లిలా కేసీఆర్ వైఖరి ఉండటం తెలిసిందే. ఇన్నాళ్లు బీజేపీని తిట్టిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రాష్ర్టపతిని ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. ఎప్పటికైనా దేశాధ్యక్షురాలుగా ద్రౌపద ముర్ముతో పని ఉంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ రాష్ట్ర్రపతిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రపతిని కలిసే బీజేపీయేతర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సాధించడం ఖాయం.

సోమవారం రాత్రి మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక్కడ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అవుతారని తెలుస్తోంది. సీఎంవో కార్యాలయం రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీజేపీ పై ఆగ్రహంతో ప్రేలాపణలు చేసిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతిని ఏ ముఖం పెట్టుకుని కలుస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ కు ఇవన్ని ఉండవు. ఎప్పుడు మాట్లాడింది అప్పుడే దులుపుకోవడం అలవాటు. అందుకే చాలాసార్లు అన్న మాటలు కూడా నేను అనలేదని తప్పించుకోవడం రివాజుగా మారింది.
Also Read: KCR- Etela Rajender: ఈటల మైండ్ గేమ్ తో కేసీఆర్ కు పట్టుకున్న టెన్షన్
కేసీఆర్ పర్యటన వెనుక మరో ఆంతర్యం దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీఎం ఆస్తులపై ఈడీ సోదాలు చేస్తారనే వార్తలు రావడంతో భయంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలిసి వారు రాకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తారనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో కూడా చర్చిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇంకా రైతు సంఘాల నేతృత్వంలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టే సభలకు రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారని చెబుతున్నారు.

రైతు సంఘం నాయకుడు టికాయత్ తో సమావేశమై రైతుల కోసం చేపట్టే ఉద్యమంలో పాల్గొనేందుకు కావాల్సిన విధానాలు రూపొందిస్తారని తెలుస్తోంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలో నిర్వహించే రైతు సదస్సుల షెడ్యూల్ ను ఖరారు చేసే పని కేసీఆర్ పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. కేంద్రం పై ఒత్తిడి పెంచే పనిలో భాగంగానే వీటిని నిర్వహించి బీజేపీని అబాసుపాలు చేయాలని యత్నిస్తున్నట్లు కేసీఆర్ మదిలో ఉన్న ఆలోచన. రోడ్ మ్యాప్ తో ఉద్యమాన్ని ఉర్రూతలూగించేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ కేంద్రంపై ఏదో ఉద్దేశంతోనే పర్యటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:AP Govt On Debts: ఏపీ అప్పుల కుప్పపై షాకింగ్ లెక్కలు బయటపెట్టిన కేంద్రం