Beggar Donates Over 50 Lakh : పిల్లికి పిడికెడు పాలు పోయని వారు సైతం మన సమాజంలో ఉన్నారు. రూపాయి దానం వేయడానికి వెనుకా ముందు ఆలోచించే వారు ఎందరో మన సమాజంలో ఉన్నారు. ఇక వచ్చిన సంపాదన అంతా ప్రజా సేవ కోసం ఖర్చు చేసేవారు మరికొందరు ఉంటారు. ఎంతైనా దానం చేయడానికి దయాగుణం కావాలి. ఆ గుణం మెండుగా ఉంది ఈ పెద్దాయనకు.. భిక్షమెత్తి అతడు చేసిన విరాళం ఎంతో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.

అయినవాళ్లు ఎవరూ ఆయనకు లేరు. అందుకే పొట్ట నింపుకోవడానికి గత 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. అందరికీ సాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును కూడా పదిమందికి పంచుతున్నాడు.
భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును ఎప్పటికప్పుడు సీఎం సహాయనిధికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ వృద్ధుడు. తమిళనాడు తూత్తుకూడికి చెందిన పూల్ పాండియన్ (72) ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ఇప్పటివరకూ రూ.55.60 లక్షలను పలు జిల్లాల కలెక్టర్లకు అందించాడు.
తాజాగా శ్రీలంక తమిళులకు ఉపయోగించాలంటూ మరో రూ.10వేలను వేలూరు కలెక్టర్ కు అందించాడు. అనంతరంపూల్ పాండియన్ మాట్లాడుతూ .. ‘తాను 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నానని..దాని ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు, కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు.
ఏకంగా భిక్ష మెత్తి వచ్చే రూపాయి, అణలను కూడా పరుల కోసం.. పరోపకారిగా ఖర్చు చేస్తున్న పాండియన్ మంచి మనుసుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.