https://oktelugu.com/

Indian Politicians – Industrialist : నేతలు.. వారి కొత్త రకం బినామీ అవినీతి కథలు

Indian politicians – industrialist ఈ దేశంలో పెట్టుబడిదారుల్ని పెట్టుబడిదారులుగానే చూసేవాళ్లు ఒకప్పుడు. అంటే వాళ్లు పోగేసిన సొమ్మంతా జనాల్ని దోపిడీచేసి, పన్నులు ఎగేసి కూడబెట్టినదిగానే చూసేవాళ్లు. అందుకేవాళ్ల ఆస్తులు పెరిగినప్పుడేల్లా దేశానికి అంకితం చేసేవాళ్లు. నెహ్రూ టాటాకి చెందిన విమానయాన సంస్థని జాతీయం చేశాడు. నెహ్రూ తర్వాత ప్రధాని అయిన ఆయన కూతురు ఇందిర పరిశ్రమలే కాదు చెలామణీలోని డబ్బుని నియంత్రిస్తూ బ్యాంకుల్ని జాతీయం చేసింది. రాజాభరణాల్ని రద్దు చేసింది. బడాబాబుల వద్దనున్న భూమీద హక్కుల్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2022 / 07:33 PM IST
    Follow us on

    Indian politicians – industrialist ఈ దేశంలో పెట్టుబడిదారుల్ని పెట్టుబడిదారులుగానే చూసేవాళ్లు ఒకప్పుడు. అంటే వాళ్లు పోగేసిన సొమ్మంతా జనాల్ని దోపిడీచేసి, పన్నులు ఎగేసి కూడబెట్టినదిగానే చూసేవాళ్లు. అందుకేవాళ్ల ఆస్తులు పెరిగినప్పుడేల్లా దేశానికి అంకితం చేసేవాళ్లు. నెహ్రూ టాటాకి చెందిన విమానయాన సంస్థని జాతీయం చేశాడు.

    నెహ్రూ తర్వాత ప్రధాని అయిన ఆయన కూతురు ఇందిర పరిశ్రమలే కాదు చెలామణీలోని డబ్బుని నియంత్రిస్తూ బ్యాంకుల్ని జాతీయం చేసింది. రాజాభరణాల్ని రద్దు చేసింది. బడాబాబుల వద్దనున్న భూమీద హక్కుల్ని రద్దుచేస్తూ లాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చింది.

    ఇందిర తర్వాత ఆమె కొడుకు రాజీవ్ వచ్చాడు. పరిస్తితి ఏమీ మారలేదు. ప్రపంచంలోని సరళీకృతంలో మార్కెట్లోకి కొందరు పెట్టుబడారులకు దారులు దొరికాయి. అయినప్పటికీ వాళ్లు అదుపులోనే వున్నారు. ఎంతగా అంటే, ఒక దేశ ప్రధాని పక్కన కాసేపు కూర్చోవడం కోసం ప్రపంచం మొత్తాన్నీ ఒక చోట చేర్చి ఆడించే క్రికెట్ ఆటకోసం ప్రపంచకప్ ఆటలపోటీల్ని ఈ దేశంలో నిర్వహించాల్సి వచ్చింది. ఆ పోటీ రిలయన్స్ కప్. ఆ సందర్భం ఫైనల్ మాచ్‌లో కాసేపు ధీరూభాయ్ అంబానీ రాజీవ్ గాంధీ పక్కన కుర్చీ లో కూర్చొని మ్యాచ్ చూడడం కోసం..

    తర్వాత కాలంలో ప్రజామోదం కోల్పోయిన రాజకీయనాయకులు పెట్టుబడిదారుల్ని పక్కన పెట్టుకుని పదవుల్ని నిలుపుకోవడం ఆరంభించారు. రాజీవ్ తర్వాత వచ్చిన పీవీ నరసింహా రావు లాంటివారు ఈ పని విచ్చలవిడిగా చేశారు. ఒక్కసారి తెరిచిన ఈ గేట్లు పెట్టుబడిదారుల్లో ధైర్యం పెంచింది. ధైర్యంగా ప్రధానుల పక్కన నిలబడడం ఆరంభించారు.

    పీవీ కాలంలో అందరు నేతలకూ డబ్బులిచ్చిన పెట్టుబడిదారులు అనంతర కాలంలో తమకెవరు ఎక్కువ సహాయం చేస్తే వాళ్లకు ఎక్కువ చేస్తామనే డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు. అంటె జనాల్ని ఎంత ఎక్కువ దోపిడీ చేయడానికి అవకాశమిస్తే అంతగా మీ పార్టీకీ, మీకూ సహాయం చేస్తామనే స్థితి అన్నమాట.

    పెట్టుబడిదారులు ఇలా ఎదగడం చూసిన రాజకీయ నాయకులు మరో అడుగు ముందుకేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అడుగు. దీని ప్రకారం టాటా, బిర్లా, అంబానీ, బజాజ్, జిందాల్, గోద్రేజ్ అంటూ పెట్టుబడిదారుల అదుపులో వుండడం.. వాళ్లకి సహాయంగా వుండే స్టాక్ బ్రోకర్లైన హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటివారిని పోషించడం ఎందుకు అనుకున్నారు. తామే ఎందుకు కొత్త పెట్టుబడిదారుల్ని సృష్టించరాదు? ఎందుకు స్టాక్ బ్రోకర్లని తయారు చేయరాదు? అనే అత్యంత దారుణమైన ఆలోచన మొగ్గతొడిగింది. దాని ఫలితం మీ ముందు అదానీ గౌతం అదానీ అనే అత్యంత సక్సెస్‌ఫుల్ పెట్టుబడిదారు. భరత్ ఝుంఝున్‌వాలా అనే స్టాక్ బ్రోకర్. ఇక్కడ మారో ప్రత్యేకత ఏమంటే ఈ దోపిడీ ఈ దేశంలోనేగాక ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ నిరసనల మధ్య కూడా కొనసాగించడానికి ప్రభుత్వం బ్యాంకుల నుండి అప్పులిచ్చి మరీ బొగ్గు గనులు తవ్విస్తోంది. ఆర్థికంగా అతలాకుతలమై పోయిన శ్రీలంక వంటి చిన్న దేశంలోనూ దోపిడీ కోసం ఒత్తిడిచేసి విద్యుత్ ప్రాజెక్టులు దక్కేలా చేయడం. ఇప్పుడు రాజకీయ నాయకులు అవినీతి చేయడం లేదు. బినామీలతో వ్యాపారం చేస్తున్నారు . ఇదే మనమిప్పుడు అర్థం చేసుకోవాల్సింది.

     

    Tags