https://oktelugu.com/

దేశంలో ఘోరమైన విపత్తు.. భారీ ఆర్థిక ముప్పు?

కరోనా మహమ్మారి‌ అటు ఎంప్లాయిమెంట్‌నే కాకుండా.. ఇటు దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను పెద్ద ఎత్తున దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌లో పరిశ్రమలు, ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. ఆర్థిక వ్యవస్థ మాత్రం డీలా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌, మే, జూన్‌) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా 23.9 శాతం మైనస్‌లోకి పడిపోయినట్లు నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. Also Read: ప్రణబ్ ఎలా చనిపోయాడు? […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2020 / 11:10 AM IST
    Follow us on


    కరోనా మహమ్మారి‌ అటు ఎంప్లాయిమెంట్‌నే కాకుండా.. ఇటు దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను పెద్ద ఎత్తున దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌లో పరిశ్రమలు, ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. ఆర్థిక వ్యవస్థ మాత్రం డీలా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌, మే, జూన్‌) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా 23.9 శాతం మైనస్‌లోకి పడిపోయినట్లు నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది.

    Also Read: ప్రణబ్ ఎలా చనిపోయాడు? అలా ఎందుకు జరుగుతుంది?

    అంతకుముందు త్రైమాసికం అంటే 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జీడీపీ 3.1 శాతం వృద్ధిలో ఉండగా.. ఈ త్రైమాసికంగా ఊహించని విధంగా పడిపోయింది. గతేడాది ఆర్థిక సంవత్సరం (2019–20) తొలి త్రైమాసికంలో జీడీపీ 5.2 శాతంలో వృద్ధిలో ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు తిరోగమించింది. ఏకంగా 23.9 శాతం కుంచించుకుపోయిందంటే కరోనా వైరస్ ఎంత పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. 1996లో భారత్ త్రైమాసిక గణాంకాలు విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంత ఘోరమైన పతనం ఎప్పుడూ రాలేదు.

    రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడం దేశ ఫైనాన్షియల్‌పై ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ పెట్టిన మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా.. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి దారుణంగా దెబ్బతిన్నాయి. నెక్ట్స్‌ త్రైమాసికం (జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌‌)లోనూ ఇలాగే ఉంటే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఇప్పుడున్న గణాంకాలు, పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆ ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏ దేశంలోనైనా రెండు త్రైమాసికాలు ఆర్థిక వ్యవస్థ కుంగిపోతే.. ఆ దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు లెక్కల్లోకి తీసుకుంటారు. మన దేశంలో చివరిసారి 1980లో ఆర్థిక మాంద్యం రాగా.. స్వాతంత్ర్యం వచ్చాక ఇది నాలుగోది.

    ఈ భారం నుంచి బయటపడేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. భారత్‌లో ఇప్పటివరకూ 36 లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదుగా.. గత ఆదివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 78,761 కొత్త కేసులు వచ్చాయి. ప్రపంచంలోని మరే దేశంలోనూ రోజు వారీగా కేసులు ఇంతగా పెరగలేదు. అయినప్పటికీ.. దేశంలో ఆర్థికపరంగా రెండో లాక్‌డౌన్‌ను పెట్టే పరిస్థితి లేదు. ఎలాగైనా ఎకనామిని పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు.

    Also Read: భారత్-చైనా మళ్లీ వార్.. అసలేం జరిగింది?

    ఎలా చూసినా భారత్‌ ఈ పరిస్థితి నుంచి స్పీడ్‌గా కోలుకునే అవకాశాలు అయితే తక్కువే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లు, వాణిజ్యం, విద్యుదుత్పత్తి, తయారీ రంగం, భవన నిర్మాణ రంగం.. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతీ విభాగంలో తొలి త్రైమాసికంలో తీవ్రమైన పతనాలు వచ్చాయి. ఒక్క వ్యవసాయ రంగంలోనే సానుకూల వృద్ధి నమోదైంది. ఆ రంగంలో 3.4 శాతం వృద్ధి కనిపించింది. ఏ వస్తువు తయారు చేసినా ఇప్పట్లో ప్రజలు పెద్దగా కొనే పరిస్థితులు కనిపించడం లేదు.

    అటు ఫైనాన్షియల్‌ ప్రభావం.. ఇటు కరోనా భయం వారిని వెంటాడుతూనే ఉంది. వీటికితోడు ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలూ భారీగా పడిపోయాయి. రిటైల్‌ రంగాలు, పరిశ్రమలు ఇంకా కుదుటపడలేదు. వీటన్నింటి నేపథ్యంలో దేశం ఈ భారీ ఆర్థిక మాంద్యం నుంచి ఎలా బయటపడుతుందా అనేది ఆందోళనగా మారింది.