Husband – Wife : కోర్టు సంచలనం : మొగుడు చచ్చినట్టు పెళ్లానికి భరణం కట్టాల్సిందే..

. కూలీ పనిద్వారా వచ్చే రోజువారీ ఆదాయం రూ.300 నుంచి రూ.400 ల్లో నెలకు రూ.2 వేలు భార్యకు ఇవ్వాలని ఆదేశించింది.

Written By: Dharma, Updated On : January 29, 2024 1:15 pm
Follow us on

Husband – Wife : విడాకులు ఇచ్చిన భార్యకు మాజీ భర్త భరణం ఇవ్వాల్సిందే అని అలహాబాద్‌ కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం, ఆదాయం లేదనే సాకుతో మనోవర్తి చెల్లిచలేనని చెప్పడం తగదని స్పష్టం చేసింది. భార్యకు భరణం చెల్లించడం భర్త విధి అని తెలిపింది. ఉద్యోగం లేకపోతే కూలీ పని చేసైనా భరణం చెల్లించాల్సిందే అని ఆదేశించింది. ఈమేరకు అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంజ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రేణుఅగర్వాల్‌ ఆదేశాలు ఇచ్చారు.

విడాకుల కేసు విచారణలో..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని పెళ్లయిన ఏడాదికే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ప్యామిలీ కోర్టులో కేసు పెట్టింది. విడాకులు కావాలని కోరగా అందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రతీనెల మనోవర్తి చెల్లించాలని భర్తను ఆదేశించింది.

మనోవర్తి చెల్లించకపోవడంతో..
అయితే ఫ్యామిలీ కోర్టు ఆదేశాల ప్రకారం భర్త మనోవర్తి చెల్లించకపోవడంతో భార్య మళ్లీ అలహాబాద్‌ హై కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు భార్యకు మనోవర్తి చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే తాను కూలీ పని చేసుకుని బతుకుతున్నానని, తనకు ఉద్యోగం లేదని, తనపై తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు ఆధారపడి ఉన్నారని కోర్టుకు భర్త తరుఫు న్యాయవాది విన్నవించాడు. అంతేకాకుండా మాజీ భార్య టీచర్‌గా ఉద్యోగం చేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందని తెలిపారు. కానీ దానిని నిరూపించలేకపోయాడు. దీంతో న్యాయమూర్తి ఉద్యోగం లేకపోయినా, అనారోగ్యం ఉన్నా.. కూలీ పని చేసుకుని అయినా మనోవర్తి చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. కూలీ పనిద్వారా వచ్చే రోజువారీ ఆదాయం రూ.300 నుంచి రూ.400 ల్లో నెలకు రూ.2 వేలు భార్యకు ఇవ్వాలని ఆదేశించింది.