Kangana Ranaut: ‘మండి’ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇటీవల భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ కంగనా రౌనత్ కు ఎయిర్ పోర్టులో ఊహించని సంఘటన ఎదురైంది. విజయం సాధించిన ఆమె ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు చండీఘడ్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టుకు వచ్చింది.
భద్రతా తనిఖీ తర్వాత, కంగనా బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్తుండగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ LCT కుల్విందర్ కౌర్ కంగనాను చెంపదెబ్బ కొట్టినట్లు తెలిసింది. అయితే దీనిపై కుల్విందర్ సింగ్ ఇచ్చిన వివరణ స్పష్టంగా లేదు. గతంలో మోడీ తెచ్చిన రైతు చట్టాలపై కంగనా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కుల్విందర్ సింగ్ ఈ చర్యకు పాల్పడినట్లు చెప్తోంది.
అయితే, దీనిపై కంగనా రనౌత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయాన్ని ఆమె ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు మాత్రం తెలిసింది. అసలు విమానాశ్రయంలో ఏం జరిగిందో CISF కూడా స్పష్టం చేయనప్పటికీ, సీనియర్ అధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.
కంగనా రనౌత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాతి రోజే ఈ షాకింగ్ ఘటన జరగడంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. అయితే గెలిచిన సమయంలో కంగనా తన నియోజకవర్గం ప్రజలకు ఇన్ స్టాలో కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈ ప్రేమ, నమ్మకానికి దయపూర్వక కృతజ్ఞతలు.. ఈ విజయం మీ అందరికీ అంకితం, ఇది ప్రధాని మోదీ, బీజేపీపై మీ విశ్వాసం, ఇది సనాతన్ విజయం, మండి గౌరవార్థం’ అని క్యాప్షన్ రాసింది.
ఇక నటన పరంగా చూస్తే కంగనా త్వరలో ‘ఎమర్జెన్సీ’లో కనిపించనుంది. ఇందిరా గాంధీ నాయకత్వంలో ప్రకటించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె మాజీ ప్రధాని పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని 2021లో కంగనా ప్రకటించి. ఇది రాజకీయ డ్రామానే అయినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ కాదని స్పష్టం చేసింది. దీనిలో నటించడమే కాదు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంది. ఎమర్జెన్సీ జూన్ 14, 2024నే థియేటర్లలోకి రావాల్సి ఉంది, కానీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడింది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో, కంగనా మాట్లాడుతూ తాను గెలిస్తే కమిట్‌మెంట్ సినిమాలను పూర్తి చేసి, రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పింది. ఏది ఏమైనా ఎయిర్ పోర్టులో ఆమెకు జరిగిన ఘటనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: The cisf guard who slapped kangana ranaut is this the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com