Media One: ఆ బడా న్యూస్ చానెల్ ను నిషేధించి మీడియాను దారికి తెచ్చిన కేంద్రం!

Media One: మీడియా అనగానే.. చేతిలో మైక్.. జర్నలిస్ట్ కార్డ్.. అక్రిడిటేషన్.. అబ్బో జర్నలిస్టులు పైలోకంనుంచి దిగివచ్చిన ప్రత్యేక పురుషులుగా భావిస్తారు. కొందరైతే రోడ్డుపై రూల్స్ పాటించక పోలీసులనే బెదిరిస్తారు. కొందరికైతే పట్ట పగ్గాలుండవు. ప్రభుత్వాలు, ప్రముఖులపై ఇష్టానుసారంగా కథనాలు రాసేస్తారు. కొందరైతే ప్రభుత్వాలనే శాసిస్తారు. ఇక కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వంలో మీడియాకు అయితే పట్టపగ్గాల్లేవంటున్నారు.  ఇష్టానుసారంగా వార్తలు, కథనాలు రాస్తే ఎవరూ ఊరుకోరు. తాజాగా ఫస్ట్ టైం కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. ఆ మీడియా […]

Written By: NARESH, Updated On : January 31, 2022 6:28 pm
Follow us on

Media One: మీడియా అనగానే.. చేతిలో మైక్.. జర్నలిస్ట్ కార్డ్.. అక్రిడిటేషన్.. అబ్బో జర్నలిస్టులు పైలోకంనుంచి దిగివచ్చిన ప్రత్యేక పురుషులుగా భావిస్తారు. కొందరైతే రోడ్డుపై రూల్స్ పాటించక పోలీసులనే బెదిరిస్తారు. కొందరికైతే పట్ట పగ్గాలుండవు. ప్రభుత్వాలు, ప్రముఖులపై ఇష్టానుసారంగా కథనాలు రాసేస్తారు. కొందరైతే ప్రభుత్వాలనే శాసిస్తారు. ఇక కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వంలో మీడియాకు అయితే పట్టపగ్గాల్లేవంటున్నారు.  ఇష్టానుసారంగా వార్తలు, కథనాలు రాస్తే ఎవరూ ఊరుకోరు. తాజాగా ఫస్ట్ టైం కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. ఆ మీడియా చానెల్ కు షాకిస్తూ ఛానెల్ పై చర్యలకు దిగింది.

కేరళ కేంద్రంగా ‘మీడియా వన్’ పేరుతో న్యూస్ ఛానల్, మాధ్యమం అనే దిన పత్రికను నడుపుతున్న మాధ్యమం బ్రాడ్‌కాస్టింగ్‌ లిమిటెడ్ టెలివిజన్ ప్రసారాలను భద్రతా కారణాల రీత్యా నిలిపివేస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. మలయాళం టీవీ న్యూస్ ఛానెల్ పై కేంద్రం చర్యలకు దిగి మిగతా అన్ని న్యూస్ చానెల్స్ కు షాకిచ్చింది.

సోమవారం నుంచి ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. భద్రతా పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రసారసేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు మీడియా వన్ టీవీ ఎడిటర్ ప్రమోద్ రామన్ కేంద్రం తమ చానెల్ ప్రసారాలపై నిషేధం విధించినట్లు తెలిపారు.

భద్రతా కారణాలతో ఒకచానెల్ ను కేంద్రం నిషేధించడం మీడియా వర్గాల్లో సంచలనమైంది. ఇప్పటిదాకా పట్టపగ్గాల్లేకుండా సాగుతున్న మీడియాకు ఈ పరిణామం మింగుడుపడడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా.. దేశ భద్రతకు ప్రమాదకరంగా కథనాలు రాస్తున్న చానెల్ కు గట్టి షాక్ తగిలింది. ఈ పరిణామం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అన్ని మీడియాలు సెట్ రైట్ అయ్యాయి.

కేంద్రం నిషేధంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీనిపై మేము చట్టపరంగా ముందుకు వెళతామని మీడియా వన్ చానెల్ తెలిపింది. ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపింది. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు.

అయితే టీవీ చానెల్ లైసెన్స్ ఇంకా పూర్తవ్వలేదని.. లైసెన్స్ పునరుద్ధరణ అంశంపై నిషేధం విధించినట్లు చానల్ వర్గాలు తెలిపాయి. 2020లోనూ మీడియా వన్ చానెల్ పై కేంద్రం 48 గంటల నిషేధం విధించింది.