AP Govt On Debts: ఏపీ అప్పుల కుప్పపై షాకింగ్ లెక్కలు బయటపెట్టిన కేంద్రం

AP Govt On Debts: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏపీ విడిపోయినప్పటి నుంచే ఆ రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ అప్పులు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో ఆ అప్పుల సంఖ్య వింటేనే భయం వేసేలా ఉంది. అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అనేక ప్రచారాలు జరుగుతుండడంతో ప్రభుత్వం ఓ వివరణ పత్రాన్ని విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు […]

Written By: NARESH, Updated On : July 26, 2022 4:34 pm
Follow us on

AP Govt On Debts: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏపీ విడిపోయినప్పటి నుంచే ఆ రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ అప్పులు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో ఆ అప్పుల సంఖ్య వింటేనే భయం వేసేలా ఉంది. అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అనేక ప్రచారాలు జరుగుతుండడంతో ప్రభుత్వం ఓ వివరణ పత్రాన్ని విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కువగా చేసి ఎదురుదాడి చేసినట్లుగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలు ఎక్కడా లేవు. అప్పులు పెరిగిపోవడానికి కరోనాను సాకుగా చూపారు.

AP Govt On Debts

ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విధాలా వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ 11 నెలల్లోనే కార్పొరేషన్ల ద్వారా కాకుండానే 79 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ రుణం అంతా ప్రభుత్వం ఏం చేసిందో ఎవరికీ అంతుబట్టని విషయం. ఎందుకంటే ఏ బిల్లులు కూడా చెల్లించిన దాఖలాలు లేవు. అటు చూస్తే పెండింగ్‌ బిల్లులు చాలానే ఉన్నాయి. ఇటు చూస్తే అప్పులు పెరిగిపోయాయి. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల్లోనూ అమ్మ ఒడి ఒక్కటే నికరంగా రాష్ట్రం ఇచ్చేది. రైతు భరోసాలో సగం కేంద్రమే భరిస్తోంది. మిగితా పథకాల్లోనూ లబ్ధిదారుల సంఖ్య అత్యల్పం. మరి ఏ పథకాలకు ఏ మేరకు ఖర్చు చేశారనేది ఎవరికీ తెలియడం లేదు. ఖర్చుల వివరాలన్నీ వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టింది కూడా ఏమీలేదు.

Also Read: President Droupadi Murmu: రాష్ట్రపతి అసలు పేరు ద్రౌపది ముర్ము కాదట? ఆమె అసలు పేరు.. చరిత్ర ఏంటో తెలుసా?

ఈ క్రమంలోనే ఏపీ అప్పుల లెక్కలను కేంద్రం బయటపెట్టింది. అందినకాడికి అప్పులు చేస్తూ కుప్ప చేస్తోందట ఏపీ సర్కార్. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం తెలిపింది. ఏపీ పరువు తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న అప్పుల చిట్టాను మరోసారి కేంద్రం పార్లమెంట్ లో బయటపెట్టింది.

ఈ ఆర్థిక సంవత్సరం అనుమతించిన అప్పుల్లో 3 నెలల్లోనే ఏపీ సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు వెల్లడించింది. రాజ్యసభకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలు వెల్లడించారు. కేంద్రం, నాబార్డు నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్లు తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

AP Govt On Debts

2022-23లో నికర రుణ పరిమితి కింద ఏపీకి రూ.44574 కోట్ల రుణానికి కేంద్రం అనుమతిచ్చింది. మొదటి 9 నెలలకు రూ.40803 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మొదటి 3 నెలల్లోనే 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.

ఏప్రిల్ నాటికే రూ.21890 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి మరో రూ.1373.47 కోట్లను ఏపీ రుణంగా తీసుకుంది. అప్పు పుట్టిన ప్రతిచోటా ఏపీ రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఏపీ అప్పుల బీభత్సాన్ని కేంద్రం కళ్లకు కట్టింది. రాష్ట్రాల అప్పుల లెక్కను బయటపెట్టింది. ఇందులో ఏపీ పరిస్థితి మరీ తీసికట్టుగా మారిందని వెల్లడించింది. మరి ఈ లెక్కలపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరీ.

Also Read:Sharmila Jagan: సొంత అన్న జగన్ పై ఈ సెటైర్లు ఏంటమ్మా షర్మిల!

Tags