Pan 2.0 : దేశంలోని పాన్‌కార్డులను అప్‌డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేవంలో 42 ఏళ్లుగా పాన్‌కార్డులు జారీ చేస్తోంది. ఆదాయపన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు, పన్ను చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం ఈ పాన్‌కార్డులు జారీ అవుతున్నాయి 1972 నుంచి పాన్ కార్డుల జారీ మొదలైంది. కార్డులను డిజిటల్ చేసినా.. పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు అప్‌డేట్ చేయలేదు. తాజాగా కేంద్రం పాన్ 2.0 అమలు చేయాలని నిర్ణయించింది. ప్రనస్తుతం దేశంలో 78 కోట్లకుపైగా సాధారణ పాన్‌కార్డులు ఉన్నాయి. పాన్ 2.0లో భాగంగా కొత్త కార్డులను క్యూఆర్ కోడ్‌తో జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
రూ. 1,435 కోట్లు కేటాయింపు
పాన్ కార్డు అప్‌డేట్ కోసం కేంద్రం రూ.1,435 కోట్లు కేటాయించింది. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు, సాంకేతిక మార్పులు తీసుకురావడమే పాన్ 2.0 ముఖ్య ఉద్దేశం. కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. అయితే పాన్ 2.0 ప్రాజెక్టు తీసుకొస్తున్న వేళ పాన్ కార్డుదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత కార్డుల పరిస్థితి ఏంటి. కార్డులో కరెక్షన్ చేసుకోవడం వీలవుతుందా వంటి ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి. దీంతో ఆదాయపుపన్ను శాఖ తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
కొత్త కార్డు అవసరం లేదు..
ఇప్పటికే పాన్‌కార్డు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చినా పాత కార్డులు కొనసాగుతాయి. నంబర్లూ అవే ఉంటాయి.
కరెక్షన్లకు ఛాన్స్..
ఇక పాన్‌కార్డులో ఏవైనా పొరపాట్లు ఉంటే.. ఏవైనా సవరణలు చేసుకోవాలనుకుంటే.. పాన్ 2.0 వచ్చినా చేసుకోవచ్చు. ఈ మెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, పేరులో సవరణలు చేసుకోవచ్చు. పాన్ 2.0లో ఉచితంగా సవరణ చేస్తారు. ప్రస్తుతం ఆధార్ సహాయంతో ఆయా వివరాలను ఎన్‌ఎస్‌ఈఎల్, యూటీఐఎస్‌ఎల్ వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
క్యూఆర్ కోడ్ పాతదే..
ఇక పాన్ 2.0 ప్రాజెక్టు లో పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో వస్తాయి. అలాగని ఇది కొత్త విధానం కాదు. 2017–18 నుంచిజారీ చేస్తున్నారు. దీనినే 2.0 గా కొనసాగిస్తారు. క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేస్తే పాన్ డేటా బేస్‌లో ఉన్న వివరాలు వస్తాయి. క్యూఆర్ కోడ్‌లేని పాన్‌కార్డుదారులు ప్రస్తుతం, భవిష్యత్‌లో క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు జారీకి దరఖాస్తు చేసుకోవచ్చు.