AP government: దావోస్ లోనూ అదే భజన.. అబద్ధాలను వండి వార్చుతున్న ఏపీ సర్కారు

AP government: మింగ మెతుకు లేదు.. కానీ మీషాలకు సంపంగి నూనె అన్నట్టుంది ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. ఒకవైపు వ్యవస్థలన్నీ నాశనమై.. ఏపీ ప్రభుత్వం వైపు పారిశ్రామికవేత్తలు చూడడం లేదు. అంతా సవ్యంగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సదస్సులో కూడా ఇదే బిల్డప్ ఇస్తోంది. పాత పాటను వండి వార్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే. అన్ని వ్యవస్థలూ బాగున్నాయంటూ జగన్‌ ప్రభుత్వం భజన చేసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్‌ తమకు అనుకూలంగా […]

Written By: Dharma, Updated On : May 23, 2022 7:00 pm
Follow us on

AP government: మింగ మెతుకు లేదు.. కానీ మీషాలకు సంపంగి నూనె అన్నట్టుంది ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. ఒకవైపు వ్యవస్థలన్నీ నాశనమై.. ఏపీ ప్రభుత్వం వైపు పారిశ్రామికవేత్తలు చూడడం లేదు. అంతా సవ్యంగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సదస్సులో కూడా ఇదే బిల్డప్ ఇస్తోంది. పాత పాటను వండి వార్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే. అన్ని వ్యవస్థలూ బాగున్నాయంటూ జగన్‌ ప్రభుత్వం భజన చేసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్‌ తమకు అనుకూలంగా ఉండే గ్రూపులు, సంస్థలతో నాలుగు ముక్కలు మాట్లాడించి.. దానిని కూడా ఎడిట్‌ చేసి తమకు కావలసిన రెండు ముక్కలను మాత్రం మీడియాకు విడుదల చేస్తుండడం గమనార్హం. దావో్‌సలో తొలిరోజు ఆదివారం జగన్‌రెడ్డి బృందం బోస్టన్‌ కన్సెల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) గ్లోబల్‌ చైర్మన్‌ హన్స్‌పాల్‌ బక్నర్‌తో భేటీ అయింది. బీసీజీ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ..! జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ఆటకు ఈ గ్రూపే కీలకం. అమరావతి రాజధాని నిర్మాణంపై ఇదే సంస్థను సమతుల-సమగ్ర వృద్ధిపై జగన్‌ అప్పట్లో ఒక నివేదిక కోరారు. ఆ రిపోర్టు రాకముందే ఆయన అసెంబ్లీలో మూడు రాజధానులు ఉండాలని ప్రకటించారు. బీసీజీ కూడా ఆ దిశగానే నివేదిక ఇచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, రాజ్‌భవన్‌ విశాఖపట్నంలో ఉండాలని.. అసెంబ్లీ అమరావతిలో గానీ, విజయవాడలో గానీ పెట్టాలని.. హైకోర్టు కర్నూలులో ఉండాలన్న ఆయన పలుకులనే అందులో పొందుపరిచింది. ఇందుకోసం అనేక అబద్ధాలను ఈ గ్రూపు వండివార్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

Jagan, Adani

బీసీజీపై జనాగ్రహం..

అప్పట్లో నివేదిక ఇచ్చిన సదరు బీసీజీపై కొందరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు దావో్‌సలో ఆ పాత సంబంధాలతో అదే బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ బక్నర్‌తో జగన్‌ చర్చించారు. ఆ తర్వాత బక్నర్‌తో సీఎం వెంట వెళ్లిన బృందం మాట్లాడించింది. ‘విద్య, వైద్య రంగాలు, తగిన మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న చొరవ సానుకూల ఫలితాలను ఇస్తుంది. రాబోయే రోజుల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది.. విద్య, వైద్యం, ఆహారభద్రత ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. అవి లేకపోతే ఏమీ సాధించలేం. గొప్ప గొప్ప రోడ్లు, గొప్ప పోర్టులు, గొప్ప విమానాశ్రయాలు ఎన్ని ఉన్నా.. వాటిని నిర్వహించే, వ్యాపారాన్ని నడిపించే మంచి విద్యావంతులు, ఆరోగ్యవంతులు లేకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు..’ అని బక్నర్‌ అంటున్న ఓ వీడియో బైట్‌ను ఆ తర్వాత విడుదల చేసింది. అయితే ఇప్పటికే దావోస్ ప్రపంచ వాణిజ్య సదస్సులో ఎటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని.. దానిపై ఆశలు పెట్టుకోలేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ డొల్లతనం బయటపడడం, విమర్శలు చుట్టుముడుతుండడంతో ఇప్పుడు దానికి విరుగుడుగా వీడియో ఎడిటింగ్ ద్రుశ్యాలు తెరపైకి తేవడం విమర్శలకు తావిస్తోంది.

Also Read: Jeevita Rajasekhar జీవితా రాజశేఖర్ కు షాక్.. ‘శేఖర్’ మూవీ నిలిపివేత

ప్రముఖులతో భేటీ..

Jagan In Davos

దావో్‌సలో ఏర్పాటుచేసిన ఏపీ పెవిలియన్‌ను జగన్‌ ప్రారంభించారు. డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌, వేదిక మొబిలిటీ, సుస్థిరత విభాగాధిపతి పెట్రో గోమెజ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ప్లాట్‌ఫాం భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ కూడా జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అయితే వరుసగా ఆర్థిక దిగ్గజాలతో సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలకు గాను కీలక ప్రాజెక్టులు రానున్నాయని జగన్ సొంత మీడియా బాక ఊదడం ప్రారంభించింది. వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి.

Also Read: Ariyana Glory: అనిల్ రావిపూడి, సునీల్ పై అరియానా తిట్లదండకం: దొంగసచ్చినోళ్లు అంటూ…

Recommended Videos:



Tags