Homeఅంతర్జాతీయంSalman Rushdie: సల్మాన్‌ రష్డీపై నిషేధానికి 33 ఏళ్లు.. ఇస్లాంపై రచనలతో వివాదాస్పదం!

Salman Rushdie: సల్మాన్‌ రష్డీపై నిషేధానికి 33 ఏళ్లు.. ఇస్లాంపై రచనలతో వివాదాస్పదం!

Salman Rushdie: భారతీయ మూలాలు కలిగిన వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీపై విధించిన ఫత్వాకు సరిగ్గా 33 ఏళ్లవుతోంది. ఫిబ్రవరి 14, 1989లో ఇరాన్‌ అత్యున్నత నాయకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ సల్మాన్‌ రష్డీ రాసిన ‘ది సాటనిక్‌ వెర్సెస్‌’ పేరుతో రాసిన పుస్తకంలో ఇస్లాంను, మహ్మద్‌ ప్రవక్తను అవమానించాడంటూ అతడిని చంపాల్సిందిగా ఫత్వా జారీ చేశాడు. అంతే కాదు సల్మాన్‌ రష్డీ తల 2.8 మిలియన్ల బహుమతిని ప్రకటించారు. రష్డీ విషయంలో ఖొమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇస్లాం పవిత్ర విలువలను కించ పరిచే సాహసం ఎవరూ చేయరు. ప్రపంచంలోని ముస్లింలు ఇస్లాంను, ప్రవక్తను అవమానించినందుకు సల్మాన్‌ రష్డీని ఉరి తీయాలి. అంతే కాదు దీనిని ప్రచురించిన ప్రచురణకర్తలకు కూడా శిక్ష పడాలి’ అని పిలుపునిచ్చాడు. 89 ఏళ్ల వయస్సులో కేవలం నాలుగు నెలలు జీవించి ఉన్న ఖొమేనీ మరణశిక్షను అమలు చేసేందుకు ప్రయత్నించి చంపబడిన ఎవరైనా సరే స్వర్గానికి వెళ్లే అమర వీరుడుగా పరిగణించ బడాలని పేర్కొన్నారు.

Salman Rushdie
Salman Rushdie

భారత్‌లో పుట్టిన రష్డీ..
ఇదిలా ఉండగా సల్మాన్‌ రష్డీ భారత దేశంలో పుట్టాడు. పూర్తిగా నాస్తికుడిగా పేరొందాడు. రష్డీకి బ్రిటన్‌ ప్రభుత్వం రక్షణ కల్పించింది. దాదాపు 13 ఏళ్ల పాటు జోసెఫ్‌ అంటోన్‌ అనే మారు పేరుతో తిరిగాడు. వైకింగ్‌ పెంగ్విన్‌ సెప్టెంబర్‌ 1988లో సల్మాన్‌ రష్డీ రాసిన ది సాటనిక్‌ వెర్సెస్‌ ని ప్రచురించింది. ఆనాటి నుంచి నేటి దాకా ఆంక్షల మధ్య బతుకుతున్నాడు రష్డీ.

వివాదాస్పద రచనలతో వ్యతిరేకత..
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సల్మాన్‌ రష్డీ ఇస్లాంకు , మహ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా రచనలు చేస్తూ వస్తున్నారు. వివాదాస్పద రచనలతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ముస్లింల ఆగ్రహానికి గురవుతూ వస్తున్నారు. ఇరాన్‌ సల్మాన్‌ రషీ ప్రాణానాకి వెల కట్టింది. ఆయన ఎక్కడున్నా చంపాలని పిలుపునిచ్చింది. దీంతో కొన్ని సంవత్సరాల తరబడి సల్మాన్‌ రష్డీ అజ్ఞాతంలో ఉన్నారు.

న్యూయార్క్‌లో దాడి..
పశ్చిమ న్యూయార్క్‌ లోని చౌటౌక్వా ఇనిస్టిట్యూషన్‌ లో జరిగిన కళాత్మక స్వేచ్ఛపై ప్రసంగించేందుకు శుక్రవారం వచ్చారు రష్డీ. ఆయన వేదికపై ఉండగా అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు వచ్చి దాడికి పాల్పడ్డాడు. మెడ, మొండెంపై కత్తితో పొడిచాడు. అచేతనంగా పడి ఉన్న సల్మాన్‌ రష్డీని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం రష్డీని వెంటిలేటర్‌ పై ఉంచారు. ఆయన ఒక కన్ను కోల్పోవచ్చు. అతని చేతి నరాలు దెబ్బతిన్నాయి. కాలేయం కత్తి పోటు కారణంగా దెబ్బతింది అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నవలా రచయిత సల్మాన్‌ రష్డీపై జరిగిన దాడిని రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు తీవ్రంగా ఖండించారు. కాగా రష్టీపై దాడిచేసిన వ్యక్తిని హదీ మతార్‌గా పోలీసులు గుర్తించారు. న్యూజెర్సీలోని పెయిర్‌వ్యూకు చెందిన వ్యక్తి అని తెలిపారు. అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు.

Salman Rushdie
Salman Rushdie

ఎవరీ హదీ మతార్‌..
– న్యూజెర్సీకి చెందిన హదీ మతార్‌(24) ఎందుకు రష్డీపై దాడికి పాల్పడ్డాడు? రష్డీపై దాడికి ప్రేరేపిత కారణాలేంటి? మతార్ ఏ దేశానికి చెందినవాడు? అతడిపై ఇప్పటివరకు క్రిమినల్ రికార్డు ఉందా? ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అతని సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు పరిశీలించారు. అతడు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డుకు సానుభూతిపరుడని ఆ సామాజిక మాధ్యమాలు తెలియజేస్తున్నాయి. మతారు, ఐఆర్డీసీ మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేనప్పటికీ.. నిందితుడి సెల్ఫోన్లో 2020లో హత్యకు గురైన ఇరాన్ కమాండర్ ఖాసేమ్ సోలేమాని చిత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మేరకు.. మతార్‌ ఎలాంటి గ్రూపులతో సంబంధాలు లేవని, ప్రస్తుతం అతడు ఒంటరిగానే పనిచేస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పలు వస్తువుల కోసం సెర్చ్ వారెంట్లు పొందే ప్రక్రియలో ఉన్నారు. పోలీసులు మరిన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version