YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో మీడియా దాచింది అదే..!

YS Viveka Murder Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీనిపై సిబిఐ విచారణ సాగుతోంది. ఈ విచారణలో భిన్నమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి ఎవరి మీదకు వెళుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులు ముందు జరిగిన […]

Written By: BS, Updated On : April 14, 2023 10:30 am
Follow us on

YS Viveka Murder Case

YS Viveka Murder Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీనిపై సిబిఐ విచారణ సాగుతోంది. ఈ విచారణలో భిన్నమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి ఎవరి మీదకు వెళుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులు ముందు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ హత్య జరిగినప్పుడు గుండెపోటు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందంటూ వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఎన్నికలు జరిగిపోయాయి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చింది. ఈ కేసు విచారణ త్వరగా జరిగి దోషులు ఎవరో తేలుతారని అంతా భావించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్న ఇప్పటికీ ఈ కేసు విచారణ ఒక కొలిక్కి రాకపోవడం గమనార్హం.

అవినాష్ రెడ్డి చుట్టూ బిగిసుకున్న ఉచ్చు..

అనేక మలుపులు తీసుకున్న ఈ కేసు కొద్దిరోజుల కిందట కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ బిగిసుకున్నట్లు కనిపించింది. ఈ మేరకు సిబిఐ జోరుగా దర్యాప్తు చేసింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చారు. ఆ తర్వాత కేసు విచారణ నెమ్మదించిందంటూ తెలుగుదేశం పార్టీతో పాటు సునీత ఆరోపణలు చేసింది. అనంతరం ఈ కేసులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు ఏడు పిటిషన్లు దాఖలు చేసినట్లు సిబిఐ న్యాయవాదులు చెబుతున్నారు.

మీడియా దాస్తున్న అనేక విషయాలు..

ఈ కేసులో మీడియా అనేక విషయాలను దాస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లకు నచ్చినట్లుగా వార్తలు వండి వడ్డించడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రచురితం చేస్తున్నాయని, మిగిలిన విషయాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సునీల్ యాదవ్ గురించి సిబిఐ పలు అంశాలను పేర్కొంది. అయితే, సునీల్ యాదవ్ గురించి సమాచారం ఉన్నప్పటికీ ఎక్కడ వార్తలు రాసిన సందర్భాలు లేవు. దస్తగిరికి, సునిల్ యాదవ్ వివేకాతో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు వాదనలు సందర్భంగా తెలిపారు. అయితే ఈ విషయాలను మీడియా ఇప్పటి వరకు బయటకు ప్రొజెక్ట్ చేయలేదు.

YS Viveka Murder Case

సునీత ఎందుకు టర్న్ తీసుకుందో..?

హత్య జరిగిన తర్వాత మొదట్లో మాట్లాడిన సునీత కడప ఎంపీ అవినాష్ రెడ్డి కు మద్దతుగా నాన్న ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత ఇదే వ్యవహారంపై మాట్లాడిన ఆమె అనేక విధాలుగా అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేసింది. అవినాష్ రెడ్డిని గెలిపించడానికి తిరుగుతున్నారని చెప్పిన సునీత… ఎంపీ టికెట్ కోసమే నాన్నని చంపారంటూ ఎందుకు చెప్పిందో ఎవరికీ అర్థం కాని విషయంగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో టై అప్ కావడం వల్లే ఈ వాదన వినిపించిందన్న విమర్శలు ఉన్నాయి. ఇకపోతే ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా భావిస్తున్న సునీల్ యాదవ్, దస్తగిరికి సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించడంలో మీడియా అనేక విషయాలను దాచిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.