https://oktelugu.com/

The Plight of Journalism : మరణించిన జర్నలిస్టుకు కనీస గౌరవం ఇవ్వని ఆ దమ్మున్న ఛానెల్

The Plight of Journalism : మనకు తెలిసినవారు ఎవరైనా చనిపోతే కన్నీరు కారుస్తాం.. అయ్యో అని బాధ పడతాం.. మన ఆర్థిక నేపథ్యం బాగుంటే ఎంతో కొంత సహాయం చేస్తాం.. అది మానవ నైజం కూడా. ఒక సంస్థలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసే గుండెపోటుతో ఒక వ్యక్తి చనిపోతే… ఆ సంస్థకు ఎంత బాధ్యత ఉండాలి. ఒక ఉద్యోగిని కోల్పోయినందుకు ఆ కుటుంబానికి ఎంత చేయూతనివ్వాలి? సమాజంలో ఈ సంస్థ అలానే చేస్తుంది.. ఈ దమ్మున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2023 6:34 pm
    Follow us on

    The Plight of Journalism : మనకు తెలిసినవారు ఎవరైనా చనిపోతే కన్నీరు కారుస్తాం.. అయ్యో అని బాధ పడతాం.. మన ఆర్థిక నేపథ్యం బాగుంటే ఎంతో కొంత సహాయం చేస్తాం.. అది మానవ నైజం కూడా. ఒక సంస్థలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసే గుండెపోటుతో ఒక వ్యక్తి చనిపోతే… ఆ సంస్థకు ఎంత బాధ్యత ఉండాలి. ఒక ఉద్యోగిని కోల్పోయినందుకు ఆ కుటుంబానికి ఎంత చేయూతనివ్వాలి? సమాజంలో ఈ సంస్థ అలానే చేస్తుంది.. ఈ దమ్మున్న ఛానల్ మాత్రం అందుకు విరుద్ధం. ఉదయం నుంచి రాత్రి వరకు సత్యహరిశ్చంద్రుడి మాదిరి నీతి సూక్తులు వల్లించే ఈ ఛానల్.. ఉద్యోగుల విషయంలో మాత్రం నిర్దయగా ఉంటుంది. వారు కష్టపడాలి తప్ప.. వారు కష్టాల్లో ఉంటే మాత్రం కాస్త కూడా దయ చూపదు. అంతటి కోవిడ్ టైంలోనూ చాలామంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపి తన నిర్దయను చాటుకుంది.. ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించింది.. అంతేకాదు ఎవరైనా దాతృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తే అవి ప్రచురించేందుకు ఈ యాడ్ రూపంలో డబ్బులు వసూలు చేసింది.. ఎల్లో మీడియాలో రెండో పత్రికగా, చానెల్ గా ఉంటూ తన వికృత రూపాన్ని బయటపెట్టుకుంది.

    -అందుకు కూడా అర్హత లేదా?

    మొన్న కొత్తగూడెంలో గుండెపోటుతో ఆ దమ్మున్న ఛానల్ లో పని చేసే ఒక రిపోర్టర్ కన్నుమూశాడు. ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన యాజమాన్యం.. అతడు చనిపోయిన వార్తను కూడా వేయడానికి సాహసించలేదు. సదరు చానల్లో పని చేస్తున్నట్టు కాకుండా.. ఓ సీనియర్ టీవీ జర్నలిస్టు చనిపోయినట్టు రాసింది.. కాదు కాదు మార్చేసింది.. మిగతా చానళ్లు, పత్రికలు యధావిధిగా ఆ ఛానల్ పేరును ప్రస్తావించాయి. తమకు తోచిన పద్ధతుల్లో నివాళులర్పించాయి.. కానీ ఆ దమ్మున్న ఛానల్ మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని సాకుగా చూపి తన పేరు కూడా రాసేందుకు ఇష్టపడలేదు.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ సంస్థకు ఉద్యోగులపై ఎంతటి ప్రేమ ఉందో.. చివరికి ఆ ఛానల్ కు సంబంధించిన పేపర్లో ఆ రిపోర్టర్ అంతిమయాత్ర యాడ్ కూడా ఫ్రీగా ప్రచురించలేదు. తోటి రిపోర్టర్లు తలా ఇంత వేసుకొని యాడ్ కు అయ్యే ఖర్చును భరించారు. తమ పేరు వేస్తే ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సి వస్తుందన్న భయం.. కాసులకు కక్కుర్తి పడి ఇలా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    విలపిస్తున్న జర్నలిస్టు యతిరాజ్ భార్య, కుటుంబ సభ్యులు

    విలపిస్తున్న జర్నలిస్టు యతిరాజ్ భార్య, కుటుంబ సభ్యులు

    -ఇంత ఘోరమా

    వాస్తవానికి ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఎంతో కొంత బాధ్యతను కనబరచాలి.. ఉద్యోగి బాగుంటేనే యాజమాన్యం బాగుంటుంది కాబట్టి.. కానీ ఈ దమ్మున్న ఛానల్ ఎప్పుడు కూడా ఉద్యోగుల విషయంలో అంత ప్రేమ కనబరచదు. దీనికి తోడు మిడిల్ మేనేజ్మెంట్ తీరు సరేసరి.. ఉద్యోగులను రాచి రంపాన పెట్టడంలో వీరి తర్వాతే ఎవరైనా.. కోవిడ్ సమయంలో జీతాల్లో కోత, ఉద్యోగం నుంచి బయటికి గెంటయ్యడం, కోవిడ్ వల్ల చనిపోతే కనీసం యాజమాన్యం నుంచి నయా పైసా చెల్లించకపోవడం వీరికే చెల్లింది.. ఇలాంటి వికృత పోకడల వల్ల వీధిన పడ్డ కుటుంబాలు ఎన్నో.

    తాజాగా గుండెపోటుతో మృతి చెందిన ఆ దమ్మున్న ఛానల్ రిపోర్టర్ సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగి కాదు.. వాస్తవానికి అతడికి ఉన్న అనుభవానికి ఒక జిల్లా రిపోర్టర్ కావాల్సింది.. ఆ దమ్మున్న ఛానల్ ఎండికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు చెప్పడంతో వేరే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించారు.. ఫలితంగా ఎంతో సీనియార్టీ ఉన్నప్పటికీ అతడు ఒక బీట్ రిపోర్టర్ కే పరిమితమైపోయాడు.. ఇక కోవిడ్ సమయంలో ఆ ఛానెల్ కు సంబంధించిన పేపర్ లో ఆరుగురు చనిపోయారు. కానీ ఏ ఒక్కరికి కూడా మాయా పైసా పరిహారం ఇవ్వలేదు.. ఆ కుటుంబాలను పరామర్శించలేదు.. ఇదే సమయంలో రిపోర్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి శ్రద్ధాంజలి యాడ్స్ మాత్రం వేసింది.. ఉదయం లేస్తే ఆ మోడీని దునుమాడే ఈ ఛానల్… అతడి ప్రభుత్వం చేపట్టిన స్కీం వల్ల కోవిడ్ మృతుల కుటుంబాలకు 10 లక్షలు పరిహారం వచ్చిన విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పదు.. అందుకే దీనిని ఎల్లో మీడియా అని పిలిచేది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా… ఆ ఛానల్ ఎండికి బుద్ధి రాదు.. గురువింద నీతులు మాత్రం బోలెడు చెబుతాడు..