https://oktelugu.com/

చంద్రబాబులో ఆనందం అందుకేనా..?

పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీలతో సంబంధం లేనివి. కానీ.. ఆయా పార్టీలు మాత్రం తమ పార్టీ ఇన్ని పంచాయతీలను గెలుచుకుంది అంటే.. తమ పార్టీ అంతకంటే ఎక్కువే గెలుచుకుందని ప్రకటించుకుంటూ ఉంటారు. కానీ.. పార్టీలతో ఈ ఎన్నికలతో సంబంధం లేదని అందరికీ తెలిసిందే కదా. అందుకే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తమకు నచ్చినట్లుగా తమకు ఇన్ని సీట్లు వచ్చాయంటూ ప్రకటించుకుంటూ ఉంటాయి. చివరకు వంద సీట్లు వచ్చాయని ప్రకటించుకున్నా అడ్డు ఉండదు. Also Read: మొదటి విడతలో […]

Written By: , Updated On : February 10, 2021 / 06:36 PM IST
Follow us on

Chandrababu Naidu
పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీలతో సంబంధం లేనివి. కానీ.. ఆయా పార్టీలు మాత్రం తమ పార్టీ ఇన్ని పంచాయతీలను గెలుచుకుంది అంటే.. తమ పార్టీ అంతకంటే ఎక్కువే గెలుచుకుందని ప్రకటించుకుంటూ ఉంటారు. కానీ.. పార్టీలతో ఈ ఎన్నికలతో సంబంధం లేదని అందరికీ తెలిసిందే కదా. అందుకే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తమకు నచ్చినట్లుగా తమకు ఇన్ని సీట్లు వచ్చాయంటూ ప్రకటించుకుంటూ ఉంటాయి. చివరకు వంద సీట్లు వచ్చాయని ప్రకటించుకున్నా అడ్డు ఉండదు.

Also Read: మొదటి విడతలో అధికార పార్టీదే హవా

ఏపీలో పంచాయతీ ఎన్నికల సరళిపై కేఏ పాల్‌ వినూత్నంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో తన పార్టీ వందకు వంద శాతం సీట్లను నెగ్గినట్లు ప్రకటించుకున్నా పట్టించుకునే వారు లేరన్నారు. ఈ క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ త‌మ‌దే పైచేయి అన్నట్లుగా స్పందిస్తోంది. ఈ ప‌రిణామాల మ‌ధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆనందభరితంగా స్పందించ‌డాన్ని చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌తనానికి పంచాయ‌తీ ఎన్నిక‌లే తొలి మెట్టు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. మ‌రి ఇంత‌కీ ఏమిటా ప‌త‌నం లెక్కలు? ఇంత‌కీ తెలుగుదేశం పార్టీ ఎన్ని పంచాయ‌తీల్లో నెగ్గింది? అంటే.. సవ్యంగా లేవు. చంద్రబాబు లెక్కల ప్రకారం.. 38.74 శాతం పంచాయ‌తీల్లో తెలుగుదేశం నెగ్గింది. ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు చెబుతున్న నంబ‌ర్.

మొత్తంగా చంద్రబాబు ఎంత చెప్పుకొస్తున్నా.. టీడీపీ ఎక్కడా పుంజుకోలేదనేది స్పష్టం అవుతోంది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ల‌భించిన ఓట్ల శాతం సుమారు 40. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఆయ‌న పార్టీ నెగ్గిన పంచాయ‌తీల సంఖ్య దాదాపు 38 శాతం. అంటే.. 20 నెల‌ల ప్రతిప‌క్ష వాసంలో తెలుగుదేశం పార్టీ స్థాయి మరో రెండు శాతం దిగజారింది.

Also Read: షర్మిల పార్టీపై వ్యూహాత్మక అటాక్‌

స్వయంగా చంద్రబాబు వెల్లడిస్తున్న లెక్కల ప్రకారమే.. టీడీపీ పరిస్థితి ఇలా దిగజారింది. రెండు శాతం ఓటర్లు టీడీపీని వీడారు. పార్టీల గుర్తుల్లేవు కాబ‌ట్టి చంద్రబాబు నాయుడు ఈ మాత్రం క్లైమ్ అయినా చేసుకోగ‌లుగుతున్నారు. పార్టీల గుర్తుల‌పై జ‌రిగే ఎన్నిక‌ల‌తో తెలుగుదేశం పార్టీ అస‌లు బండారం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. జ‌న‌సేన‌–-బీజేపీలు క్లైమ్ చేసుకుంటున్నది రెండు మూడు శాతం కూడా లేదు. అంటే.. మిగ‌తావి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి అని స్వయంగా చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. అయితే.. చంద్రబాబు ఈ మాత్రం రిజల్ట్‌ను కూడా ఊహించలేకపోయారనేది అర్థమవుతోంది. ఎందుకంటే.. ఊహించిన దానికంటే ఎక్కువ వస్తేనే కదా గొప్పలు చెప్పుకునేది. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అదే జరుగుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్