CM KCR: టీఆర్ఎస్ కు ఉప ఎన్నిక భయం పట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చీటికి మాటికి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. ఓటమి భయం వెంటాడుతోంది. ఒక సంవత్సరంలో ఎన్నికలు వచ్చే అవకాశముండటంతో ఉప ఎన్నిక అనివార్యమైతే ఓటమి బాధల నుంచి ఎలా గట్టెక్కాలనే తపన నేతల్లో పట్టుకుంది. ఎందుకంటే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ ను మట్టికరిపించడంతో టీఆర్ఎస్ వెన్నులో చలి వేస్తోంది. ఉప ఎన్నిక వస్తే ఎలా అనే భయం వెంటాడుతోంది.

నల్గొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక తథ్యం. ఉప ఎన్నిక జరిగితే ఫలితం ఎలా ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ కు ఉప ఎన్నిక భయం వేధిస్తోంది. కోమటిరెడ్డి రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే అభిప్రాయం అందరిలో వస్తోంది. అయినా ఈ ఉప ఎన్నికలో ఓడితే ఫలితం దారుణంగా ఉంటుందని తెలిసిందే.
ప్రస్తుతం టీఆర్ఎస్ బాస్ కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఒకవైపు ఎన్నికల వ్యూహకర్త పీకే సర్వేలు భయాందోళన కలిగిస్తున్నాయి. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమైతే అధికార పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే అని చెబుతున్నారు. ఎందుకంటే మునుగోడులో కోమటిరెడ్డి విజయం ఖాయం. దీంతో టీఆర్ఎస్ కు టెన్షన్ పట్టుకుంది. ఉప ఎన్నిక రాకపోతే బాగుండు అనే ఆలోచనలో పడుతోంది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు అచ్చిరావడం లేదు. బీజేపీకి మాత్రం ఊపు తెస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక వస్తే మాత్రం కేసీఆర్ ప్రస్థానం ముగిసినట్లే అని చెబుతున్నారు.
కోమటిరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నా ఆయన వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే బీజేపీ నూటికి నూరు పాళ్లు మేలు జరుగుతుంది. ఉప ఎన్నిక ఫలితంతో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బాటలు వేసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ కు ఉప ఎన్నిక భయం నీడలా ఆడుకుంటోంది. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే బీజేపీ ప్రయత్నాలకు మునుగోడు ఊపిరి పోస్తుందని తెలుస్తోంది.