Chandrababu: చంద్రబాబులో నైరాశ్యానికి కారణం అదే

జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు, ఒపీనియన్ పోల్స్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలుతోంది. అవన్నీ ఫేక్ సర్వేలు అని కొట్టి పారేస్తున్నా.

Written By: Dharma, Updated On : August 19, 2023 9:41 am

Chandrababu

Follow us on

Chandrababu: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వయసుకు మించి కష్టపడుతున్నారు. అయినా సరే ఎక్కడో ఒక అనుమానం. అందుకే ఇప్పుడు ఏపీ ప్రజలకు ఒక సంకేతాన్ని పంపుతున్నారు. నైరాశ్యపు మాటలు చెప్పుకొస్తున్నారు. తనకు పదవీ వ్యామోహం లేదని.. నా పోరాటం అంతా మీకోసమే అంటూ ప్రజలకు ఎడ్యుకేట్ చేసే పనిలో పడ్డారు.

వైసీపీ సర్కార్ పై అంతులేని ప్రజా వ్యతిరేకత ఉంది. మొన్నటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైంది. గత ఎన్నికల్లో వైసీపీకి గెలుపునకు సహకరించిన చాలా వర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకమయ్యారు. దీంతో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి తిరుగుండకూడదు. అయినా సరే ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ కనిపించడం లేదు. వైసీపీకి దూరమైన వర్గాలన్నీ టిడిపి పట్ల సానుకూలత చూపడం లేదు. దీంతో చంద్రబాబులో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది.

జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు, ఒపీనియన్ పోల్స్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలుతోంది. అవన్నీ ఫేక్ సర్వేలు అని కొట్టి పారేస్తున్నా.. డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకుంటున్నారని అనుకూల పత్రికలు ఘోషిస్తున్నా ఎక్కడో తేడా కొడుతుంది అన్నది చంద్రబాబు అనుమానం. 2019 ఎన్నికలకు ముందు, ఆ తరువాత తెలుగు రాష్ట్రాల విషయంలో.. జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేలన్నీ వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టిడిపి గద్దె దిగుతుందని ఇప్పుడు చెబుతున్న జాతీయ మీడియా సంస్థలే చెప్పుకొచ్చాయి. ఫలితాలు దానికి దగ్గరగానే వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి. దీంతో చంద్రబాబులో కూడా పునరాలోచన ప్రారంభమైంది.

గత కొద్దిరోజులుగా చంద్రబాబును పరిశీలిస్తే ఇది అర్థం అవుతోంది. వీలైనంత వరకు చంద్రబాబు ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. తనకు సీఎం పదవి పై వ్యామోహం లేదని.. తన తపనంత ప్రజల కోసమేనని చంద్రబాబు చెబుతున్నారు. టిడిపి అధికారంలోకి రాకుంటే.. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ప్రజలను ఓరకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కేవలం నైరాస్యంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.