KCR vs BJP : బీజేపీపై కేసీఆర్ కోపం, పగ వెనుక కారణం అదే!

KCR vs BJP : వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన గులాబీ బ్యాచ్ ఎట్టకేలకు బయటపడింది. సీఎం కేసీఆర్ మునుగోడు వేదికగా క్లియర్ కట్ గా అటు సెంటిమెంట్ ను.. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఎత్తి చూపారు. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని చాకచక్యంగా ప్రజల్లోకి, మీడియాకు చేరేలా మాట్లాడారు. ‘దేశంలోనే అత్యుత్తమ పీఠం అయిన ప్రధాని పదవిని చేపట్టారు. ఇంతకంటే పెద్ద పదవి లేదు. మీకు ఏం కావాలి మోడీ గారు.. ఎందుకిలా ఎమ్మెల్యేల […]

Written By: NARESH, Updated On : October 31, 2022 9:51 am
Follow us on

KCR vs BJP : వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన గులాబీ బ్యాచ్ ఎట్టకేలకు బయటపడింది. సీఎం కేసీఆర్ మునుగోడు వేదికగా క్లియర్ కట్ గా అటు సెంటిమెంట్ ను.. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఎత్తి చూపారు. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని చాకచక్యంగా ప్రజల్లోకి, మీడియాకు చేరేలా మాట్లాడారు. ‘దేశంలోనే అత్యుత్తమ పీఠం అయిన ప్రధాని పదవిని చేపట్టారు. ఇంతకంటే పెద్ద పదవి లేదు. మీకు ఏం కావాలి మోడీ గారు.. ఎందుకిలా ఎమ్మెల్యేల కొనుగోళ్లు చేపడుతున్నారు?’ అంటూ నేరుగానే ప్రశ్నించారు.

దీన్ని మునుగోడులో  బీజేపీని టార్గెట్ చేసేందుకు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ ను కేసీఆర్ రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉందని.. అందుకే చెప్పడం లేదని.. ‘ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితున్నది’ అంటూ కేసీఆర్ సంచలన ఆధారాలు తన వద్ద ఉన్నాయని బాంబు పేల్చారు. అవేంటి? అందులో మోడీ, షాల ప్రమేయం ఉందా? అన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

లీక్ అయినవి కొన్నే.. కాని వాటిలో ఉన్నవి ఢిల్లీ పీఠమే కదిలిపోయే నిజాలు అన్న మాట ఇప్పుడు దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. అవేంటి? ఎప్పుడు లీక్ చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే కేసీఆర్ కు బీజేపీపై ఇంత కోపం వెనుక కారణముందని టీఆర్ఎస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట బీజేపీ చేసిన రచ్చ  కేసీఆర్ ను బాగా కలిచివేసిందట.. అప్పటి నుంచి కోపం, పగతో రగిలిపోతూ ఇలా బీజేపీని అడ్డంగా బుక్ చేసేలా ప్లాన్ చేశారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను కకావికలం చేసిన కేసీఆర్ ను బీజేపీ ఆడిస్తోంది. బండి సంజయ్ సహా అమిత్ షా.. బీజేపీ పెద్దలు తరచూ తెలంగాణలో కేసీఆర్ కు ఎదురునిలుస్తూ ఆయనను కుదురుగా ఉండనీయడం లేదు. బలమైన పోటీనిస్తూ ఆగం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకు.. ఎన్నికల్లో గెలిచేందుకు సకల ప్లాన్లు చేస్తున్నారు. అందుకే బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ తన వద్దనున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తూ చావుదెబ్బ తీసేందుకు రెడీ అయ్యారు.

కేసీఆర్ తెలంగాణలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం వెనుక కూడా కారణం ఇదే.. మెరుగైన ఇంటెలిజెన్స్ సహాయంతోనే కేసీఆర్ ఇదంతా చేశారు. ఇప్పుడా ఆడియోల్లో అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పేర్లు వచ్చి బీజేపీ బుక్ అయిపోయింది. ఇదంతా కేసీఆర్ పక్కా ప్రణాళికతోనే చేశారు. కవితను ఎంతలా బ్లేమ్ చేశారో అంతకుమించి మోడీ, షాలను చేయాలనే ఈ ఉచ్చు బిగించారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆపరేషన్ ను విజయవంతం చేశారు.

సమయం చూసి ఢిల్లీ వెళ్లి మరిన్ని ఆధారాలను కేసీఆర్ బయటపెడుతారని.. మోడీ-షాలను ఇరుకునపెట్టే ఆధారాలు ఎన్నో కేసీఆర్ చెంత ఉన్నాయని సమాచారం.  దేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను చాకచక్యంగా కూల్చిన బీజేపీకి తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఒక్కడి వల్లనే కూల్చడం సాధ్యపడలేని టీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా అంటున్నారు. కేసీఆర్ నిఘా నీడలోంచి టీఆర్ఎస్ నేతలే కాదు.. హైదరాబాద్ లోని బీజేపీ నేతలు తప్పించుకోలేరని..అంతలా వేగులను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. కవితను ఇరికించిన బీజేపీ తప్పిదమే ఇప్పుడు వారిని టీఆర్ఎస్ కొనుగోళ్లలో ఇరికించేలా చేసిందన్న వాదనను వాళ్లు అంటున్నారు.