AP Politics: ఇటీవల జగన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. 175కు 175 సీట్లు సంపాదిస్తానని తొడగొడుతున్నారు. ఆఖరుకు చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంలోనూ గెలుస్తానని బీరాలకు పోకుతున్నారు. జగన్ కలల్లో విహరిస్తున్నాడో.. భ్రమల్లో విహరిస్తున్నాడో తెలియడం లేదని జనాలే అంటున్నారు. అసలు జగన్ కు ఎందుకు 175 సీట్లు ఇవ్వాలన్నది ప్రశ్న.
ఆంధ్రలో 2014 విభజన జరిగిన తర్వాత చాలా వడివడిగా అభివృద్ధి జరుగుతుందని అందరూ భావించారు. కానీ విభాజిత ఏపీ మరింత అన్యాయమైపోయింది. హైదరాబాద్ లాంటి మహానగరం తెలంగాణకు వెళ్లడంతో ఆ ఆదాయం అంతా ఏపీకి అప్పులే మిగిలాయి.
హైదరాబాద్ ను పక్కనపెడితే మిగతా తెలంగాణ జిల్లాల కంటే ఏపీ జిల్లాల వారే ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. సమాజికంగా ఆంధ్రులే ముందున్నారు. అక్షరాస్యత, సగటు ఆదాయం ఆంధ్రాలోనే ఎక్కువ.
సంక్షోభం నుంచి ఆంధ్రాను అగ్రభాగాన నిలిపే అవకాశం అటు చంద్రబాబుకు.. ఇటు జగన్ కు వచ్చింది. మొదట్లో బాగానే పద్ధతి ప్రకారం చంద్రబాబు వెళ్లారు. తర్వాత కేంద్రంతో చంద్రబాబు ఫైటింగ్ పెట్టుకొని ఆంధ్రాకు అన్యాయం చేశఆడు.
ఆంధ్రాను చెడగొట్టినదాంట్లో.. చంద్రబాబును ఇన్ ఫ్లూయెన్స్ చేసిన వారిలో టీవీ9 రవిప్రకాష్ ముఖ్యులు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఈటీవీ రామోజీరావులు కలిసి చంద్రబాబును చెడగొట్టి.. బీజేపీకి దూరంగా జరిపించారు. దాని వల్ల చంద్రబాబుకు నష్టం జరిగింది. బీజేపీకి పెద్దగా పోయిందేమీ లేదు.
2018లో జగన్ వచ్చారు. సీఎం అయ్యారు. ఈయన అయినా ఏపీని అభివృద్ధి చేస్తారనుకున్నారు. కానీ ఉన్న డబ్బులన్నీ సంక్షేమానికే ఖర్చు చేస్తున్నాడు తప్పితే.. అభివృద్ధికి ఏమాత్రం వెచ్చించడం లేదు. కనీసం చంద్రబాబు అన్ని కూడా కేటాయించడం లేదు. ఈ క్రమంలోనే జగన్ వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధిస్తాడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.