Terrorist doctors arrested : మన దేశంలో గడిచిన వారం రోజుల వ్యవధిలో ఉగ్రవాద వ్యతిరేక పోలీసుల బృందం విస్తృతంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నలుగురు డాక్టర్లు అరెస్టు అయ్యారు.. వీరి వద్ద నుంచి పోలీసులు ఏకంగా 2900 వందల కిలోల పేలుడు పదార్థాలను, రైఫిళ్ళు, పిస్టల్స్, రిసిన్, అమోనియం నైట్రేట్ వంటి విష పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది.
వాస్తవానికి ఈ పేలుడు అనేక సంచలన విషయాలను బయటపెట్టింది. ఉగ్రవాద వ్యతిరేక బృందం నలుగు డాక్టర్లను అరెస్ట్ చేసిన తర్వాత.. ఉగ్ర కుట్ర బయటపడింది. ఢిల్లీ ప్రాంతంలోని ఫరీదాబాద్ లో ఆల్ ఫలాయ్ యూనివర్సిటీ లో అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ ముజమిల్ షకీల్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రధర్, గుజరాత్ లోని డాక్టర్ అహమ్మద్ మోహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చెందిన మహిళ డాక్టర్ ను ఉగ్రవాద వ్యతిరేక పోలీసుల బృందం అరెస్ట్ చేసింది.. జమ్ము కాశ్మీర్, ఫరీదాబాద్ ప్రాంతాలలో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.. ఇందులో ఏకంగా నలుగురు పట్టు పడ్డారు. సమాజంలో వీరిని ఎవరు కూడా అనుమానించారనే ఉద్దేశంతోనే ఉగ్రవాద సంస్థలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. దేశవ్యాప్తంగా దాడులకు ప్రణాళిక రూపొందించారు.
అరెస్ట్ అయిన వైద్యులు జైషే ఏ మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థల తో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. డాక్టర్ కాబట్టి ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతోనే వీరు ఉగ్రవాద సంస్థలకు టచ్ లో ఉండేవారని తెలుస్తోంది. ఇక అరెస్టు అయిన వారిలో ఇద్దరు డాక్టర్లు 2018 -2021 కాలంలో భారత భద్రతా దళాల దాడిలో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించారని తెలుస్తోంది.. ఇక ఇదే క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ మాడ్యూల్ మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కూడా ఉగ్రదాడి అని అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. ఈ నలుగురు పట్టుబడ్డారు.
ప్రొఫెషనల్ పనిచేస్తూనే.. ఉగ్రవాదం వైపు వీరు వెళ్లారు. దర్యాప్తు సంస్థల అధికారులు ఈ డాక్టర్లు చేస్తున్న దుర్మార్గాన్ని వైట్ కాలర్ టెర్రరిజం అని పిలుస్తున్నారు. మేధావులు ముసుగులో ఉన్న వారంతా.. విద్యావంతులుగా ఉన్నవాళ్లంతా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని కూడా వైట్ కాలర్ టెర్రరిజం అని పిలుస్తుంటారు. జేషే ఏ మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్, అన్సార్ గజవతుల్ హింద్, వంటి సంస్థలు ఇలాంటి వ్యక్తుల వారి మద్దతు వల్లే దారుణమైన పనులకు పాల్పడుతున్నాయి. మనదేశంలో పై సంస్థల కార్యకలాపాలు కొంతకాలంగా విస్తృతంగా సాగుతున్నాయి. 1990లో మనదేశంలో చోటు చేసుకున్న పేలుళ్ల తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను మరింత పెంచుకున్నాయి.. దాదాపు 35 సంవత్సరాల కాలం తర్వాత ఉగ్రవాదం అనేది అనేక రూపాలను సంతరించుకుంది.. సైబర్, ఫైనాన్షియల్, బయో వంటి పేర్లతో ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తోంది.