Homeఆంధ్రప్రదేశ్‌Tadipatri Tensions: తాడిపత్రిలో వైసీపీ దౌర్జన్యకాండ.. పోలీసుల ఎదుటే దాడులు

Tadipatri Tensions: తాడిపత్రిలో వైసీపీ దౌర్జన్యకాండ.. పోలీసుల ఎదుటే దాడులు

Tadipatri Tensions: ఏపీలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భౌతిక దాడులకు దిగుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మె ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి మున్సిపల్‌ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారు. పలు వాహనాల్లో 20-30 మంది అనుచరులతో తాడిపత్రి సమీపంలోని సీపీఐ కాలనీ వద్ద శనివారం హల్‌చల్‌ చేశారు. ఇక్కడ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి చెందిన ఎస్టీపీ-1లో జరుగుతున్న పైపులైన్‌ పనులను అడ్డుకున్నారు. రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్‌, సిబ్బంది సమక్షంలోనే టీడీపీ కౌన్సిలర్లపై దాడికి దిగారు. అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో ఎమ్మెల్యే తనయుడు, అనుచరులు మరింత రెచ్చిపోయి, టీడీపీవారిని వెంటాడి మరీ చితకబాదారు.

Tadipatri Tensions
Tadipatri Tensions

ఈ దాడిలో టీడీపీ దళిత నాయకుడు, 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున, కాంట్రాక్టర్‌ మల్లికార్జునకు గాయాలయ్యాయి. దాడిని చిత్రీకరిస్తున్న పాత్రికేయులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ ఉన్న ఓ పత్రిక విలేకరిపై ఎమ్మెల్యే తనయుడు చేయి చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: AP Liquor Issue: ఏపీలో మద్యం నిషేధం లేనట్టే.. లిఖితపూర్వకంగా తెలిపిన జగన్ సర్కారు

కౌన్సిలర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ చైతన్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపులైన్‌ పనులను చేయిస్తున్న కాంట్రాక్టర్‌ మల్లికార్జునతో వాగ్వాదానికి దిగారు. వర్క్‌ఆర్డర్‌ లేకుండా పనులు ఎలా చేయిస్తావని మండిపడ్డారు. నెలరోజులైనా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు పనులు చేయిస్తున్నానని కాంట్రాక్టర్‌ చెప్పారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ దాడి తరువాత పోలీసు అధికారులు అక్కడున్న టీడీపీ వారిని తరిమివేశారు.

Tadipatri Tensions
Tadipatri Tensions

అసలేం జరిగిందంటే…

సీపీఐ కాలనీలో మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సొంత ఖర్చుతో పైపుల మరమ్మతులు, చాంబర్లలో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను టీడీపీకి చెందిన కౌన్సిలర్లు దగ్గరుండి చేయిస్తున్నారు. తాము చేయలేని పని చైర్మన్‌ చేయిస్తున్నాడన్న అక్కసుతో వాటిని అడ్డుకొనేందుకు ఎమ్మెల్యే తనయుడు ప్రయత్నించారు. స్వయంగా రంగంలోకి దిగారు. మొదటి నుంచి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరాచకాలను సామాజిక మాధ్యమాలలో నిలదీస్తున్న 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జున కనిపించడంతో పట్టరాని ఆగ్రహంతో వెంటాడి మరీ దాడిచేశారు. ఎమ్మెల్యే తనయుడి దౌర్జన్యంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి దాడులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని, రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతుంటారని తెలిపారు. మరోవైపు, దళిత కౌన్సిలర్‌ మల్లికార్జున తీవ్రంగా గాయపడేందుకు కారణమైన ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు.

Also Read:Mamata Banerjee- CM KCR: తెలుగు రాష్ట్రాలను పట్టించుకోని దీదీ.. కేసీఆర్ ఒక్కరికే ఆహ్వానం

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version