https://oktelugu.com/

Janasena Sabha: పవన్ కళ్యాణ్ మీటింగ్ తో వైసీపీలో టెన్షన్!

Janasena Sabha: రాజకీయాలైనా.. సినిమాలైనా కాస్త సంయమనం అవసరం. బరెస్ట్ అయితే అంతకు మించిన అనర్థం మరొకటి ఉండదు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మొండిపట్టుదల ఆయనకే నష్టం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన విషయంలో జగన్ అవలంభిస్తున్న వైఖరి ఆయన పార్టీకే ఎసరు తెస్తోందంటున్నారు. ముఖ్యంగా వెన్నుచూపని పవన్ కళ్యాణ్ లాంటి నేతల విషయంలో మొండిగా ముందుకెళుతున్న జగన్ అనవసరంగా పెట్టుకొని అభాసుపాలవుతున్నారన్న చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఎంత ఓపిక అవసరమో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2022 / 10:59 PM IST
    Follow us on

    Janasena Sabha: రాజకీయాలైనా.. సినిమాలైనా కాస్త సంయమనం అవసరం. బరెస్ట్ అయితే అంతకు మించిన అనర్థం మరొకటి ఉండదు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మొండిపట్టుదల ఆయనకే నష్టం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన విషయంలో జగన్ అవలంభిస్తున్న వైఖరి ఆయన పార్టీకే ఎసరు తెస్తోందంటున్నారు. ముఖ్యంగా వెన్నుచూపని పవన్ కళ్యాణ్ లాంటి నేతల విషయంలో మొండిగా ముందుకెళుతున్న జగన్ అనవసరంగా పెట్టుకొని అభాసుపాలవుతున్నారన్న చర్చ సాగుతోంది.

    రాజకీయాల్లో ఎంత ఓపిక అవసరమో జగన్ చూపించారు. దాదాపు వైఎస్ఆర్ చనిపోయిన 2009 నుంచి 2019 వరకూ 10 ఏళ్లు ప్రతిపక్షంలో పోరాడారు. జైలుకెళ్లారు. టీడీపీ రాజకీయానికి బలయ్యారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆయనలో ఓపిక నశించిందన్న వాదన ఉంది. ముఖ్యంగా జనసేన విషయంలో జగన్ వేస్తున్న తప్పటడుగులు ఇప్పుడు పవన్ ను బలమైన నేతగా మారుస్తున్నాయి.

    జగన్ ఎక్కువగా చంద్రబాబు కంటే పవన్ ను తొక్కేయాలనే ఆలోచిస్తున్నారు అయితే అంతకుమించిన రెట్టింపు వేగంతో పవన్ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పవన్ ను , మెగా ఫ్యామిలీ విషయంలో ‘శ్రీరెడ్డి’, పోసాని కృష్ణమురళీ వంటి వైసీపీ సానుభూతి పరులుతో తిట్టించడం జగన్ కు చాలా మైనస్ అయ్యింది. ఈ విషయంలో పవన్ పై సానుభూతి వెల్లివిరిసింది. ఆయనకు జనం స్వతహాగా మద్దతిచ్చేలా చేసింది. న్యూట్రల్ గా ఉండే వాళ్లు సైతం పవన్ పై జగన్ సర్కార్ ప్రతీకారానికి ఆయన వైఫు షిఫ్ట్ అయిపోయారు.

    ఇక మొన్నీ మధ్య ‘భీమ్లానాయక్’ మూవీ విషయంలో జగన్ సర్కార్ ఎంతలా ఇబ్బంది పెట్టిందో చూశాం. జగన్ జారీ చేసిన 35 జీవో స్టిక్ట్ గా అమలు చేసి భీమ్లానాయక్ రిలీజ్ అయిన థియేటర్లపైకి అధికారులను పంపి రేట్లు పెంచకుండా కఠినంగా వ్యవహరించడం ప్రజల్లోనూ పవన్ పై సానుభూతికి కారణమైంది. జగన్ ఎంతగా భీమ్లానాయక్ పై నిషేధాజ్ఞలు అమలు చేసినా.. జనం, న్యూట్రల్ గా ఉన్న వారు సైతం కసిగా భీమ్లానాయక్ మూవీ చూశారు. జగన్ ఎంత తక్కువ రేట్లు పెట్టినా చందాలు వేసి.. హుండీలు పెట్టి.. ఎక్కువ సార్లు సినిమా చూసి మరీ భీమ్లానాయక్ కు కలెక్షన్లు అందించారు.

    ఇప్పుడు ఆవిర్భావ సభా వేదికపై ‘భీమ్లానాయక్’ మూవీని జగన్ సర్కార్ అణగదొక్కిన వైనాన్ని పవన్ ఖచ్చితంగా ప్రశ్నిస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆవిర్భావ సభకు అనుమతులు ఇవ్వకుండా జగన్ సర్కార్ ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 14న జనసేన సభపై ఇప్పుడు వైసీపీ టెన్షన్ పడుతోందట.. పవన్ ఎలాంటి బాంబులు పేల్చుతాడేమోనన్న ఆందోళన వైసీపీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట.. మరి పవన్ సంధించే ఆ బాణాలేంటి? అవి వైసీపీకి ఎలా తాకుతాయన్నది వేచిచూడాలి.