Homeజాతీయ వార్తలుTension in Bandi Sanjay Padayatra: బండి సంజయ్ ను వదలని టీఆర్ఎస్.. పాదయాత్రలో ఘర్షణ

Tension in Bandi Sanjay Padayatra: బండి సంజయ్ ను వదలని టీఆర్ఎస్.. పాదయాత్రలో ఘర్షణ

Tension in Bandi Sanjay Padayatra: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. దీనిపై టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కొనసాగుతున్న పాదయాత్రకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగాల విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

Tension in Bandi Sanjay Padayatra
Tension in Bandi Sanjay Padayatra

దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఆగడాలకు సమాధానం చెప్పాల్సి ఉందని చెబుతున్నారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతుంటే చూస్తూ ఊరుకోవడం లేదని చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీంతో బీజేపీకి నష్టం లేకపోయినా టీఆర్ఎస్ కు మాత్రం ఓటమి తప్పేలా లేదని తెలుస్తోంది.

Also Read: China- Taiwan Conflict: స్వేచ్ఛా పోరాటం.. ఆధిపత్య ఆరాటం.. ఇదే ‘తైవాన్‌ – చైనా చరిత్ర!’

శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం? టీఆర్ఎస్ చేస్తున్న పిచ్చిపనిగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ పాదయాత్రతో జనంలో క్రేజీ పెరుగుతుందని భావించి అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది. పాదయాత్రకు అడ్డు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. టీఆర్ఎస్ చేస్తున్న పనికి సిగ్గు లేదా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలని చూస్తోంది. బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించకుండా చేయాలని అడ్డు తగులుతోంది.

Tension in Bandi Sanjay Padayatra
Tension in Bandi Sanjay Padayatra

దీంతో దేవరుప్పుల లో బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం అవివేకమని చెబుతోంది. టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. అందుకే బీజేపీని అడ్డుకోవాలని టీఆర్ఎస్ భావించడం సమంజసంగా లేదని వాదనలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై కూడా బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అధికార పార్టీకి వంత పాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం భావ్యం కాదని తెలుస్తోంది. మొత్తానికి బండి సంజయ్ ని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు కరెక్టు కాదని చెబుతున్నారు.

Also Read:Patriotic Movies In Telugu: సినీమాతరాన్ని పలికించిన హీరోలు వీరే.. అందరికీ వందనాలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version