‘అమూల్ డెయిరీ’తో ఏపీ గ్రామాల్లో ఉద్రిక్తతేనా?

ఏపీలో బలమైన అధికార, ప్రతిపక్షాలున్నాయి. ప్రతీ గ్రామంలో వైసీపీ, టీడీపీ అనే రెండు బలమైన వర్గాలున్నాయి. దీంతో సర్పంచ్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు కూడా వర్గపోరు.. కుమ్ములాటలు, కొట్లాటలు, దాడులు, ప్రతిదాడులు కొనసాగుతాయి. అందుకే ఇప్పుడు జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా గ్రామాల్లో వ్యతిరేకించడానికి సగం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది.తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ పాలసేకరణను ‘ఆమూల్ డెయిరీ’తో ఒప్పందం చేసుకోవడం ఏపీలోని గ్రామాల్లో ఉద్రిక్తతకు కారణమవుతోందట.. అమూల్ డెయిరీ కంపెనీ ఏపీ […]

Written By: NARESH, Updated On : June 4, 2021 6:23 pm
Follow us on

ఏపీలో బలమైన అధికార, ప్రతిపక్షాలున్నాయి. ప్రతీ గ్రామంలో వైసీపీ, టీడీపీ అనే రెండు బలమైన వర్గాలున్నాయి. దీంతో సర్పంచ్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు కూడా వర్గపోరు.. కుమ్ములాటలు, కొట్లాటలు, దాడులు, ప్రతిదాడులు కొనసాగుతాయి. అందుకే ఇప్పుడు జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా గ్రామాల్లో వ్యతిరేకించడానికి సగం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది.తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ పాలసేకరణను ‘ఆమూల్ డెయిరీ’తో ఒప్పందం చేసుకోవడం ఏపీలోని గ్రామాల్లో ఉద్రిక్తతకు కారణమవుతోందట..

అమూల్ డెయిరీ కంపెనీ ఏపీ గ్రామాల్లోని పాడి రైతుల నుండి పాలు కొనడం ప్రారంభించింది. చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే పాల సేకరణ జరుగుతోంది. ఈ రోజు నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలు కొనుగోలు చేస్తోంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతుతో అమూల్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అమూల్ తన కార్యకలాపాలను ప్రారంభించిన చోట రాజకీయ ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది.

చాలా కాలంగా ఏపీలో బలంగా ఉన్న స్థానిక డెయిరీలైన సంగం, విజయ, విశాఖ వంటి అనేక పాల సహకార సంస్థలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో తమ బలమైన ఉనికిని చాటుతున్నాయి. సంబంధిత పాడి రైతులు కూడా వారికి సెంటిమెంట్‌గా మారి వాటికే పాలు పోస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది పాడీ రైతులు రాత్రిపూట అమూల్ కు మారడానికి ఇష్టపడడం లేదు.

అయితే అమూల్ పాల సేకరణ రాజకీయ రంగును అలుముకుంది. పాలక వైసీపీ నాయకులు తమ వాలంటీర్లు, స్థానిక నాయకుల ద్వారా పాడి రైతులపై అమూల్‌కు మాత్రమే పాలు పోయాలని ఒత్తిడి తెస్తున్నారు. పాడి రైతులకు తమ పాలను అమూల్‌కు పోయకపోతే పెన్షన్లు, రేషన్ మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు లభించవని వారు బెదిరిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇది రాజకీయంగా గ్రామాల్లో ఎక్కువ విభేదాలను సృష్టిస్తోంది.