Gitam University: గీతం వర్సిటి మళ్లీ అట్టుడుకుతోంది.. పోలీసుల ముట్టడి..అసలేం జరుగుతోంది?

Gitam University: విశాఖలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గీతం యూనివర్సిటీని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నలువైపులా మోహరించిన పోలీసుల మధ్య ఫెన్సింగ్ సామగ్రితో రెవెన్యూ అధికారులు యూనివర్సిటీ లోపలికి ప్రవేశించారు. వర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోని డెంటల్‌ కాలేజ్‌ వద్ద కిలోమీటర్‌ మేర కంచె వేశారు. కంచె వేసిన స్థలం మొత్తం ప్రభుత్వానిదేనని అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత.. రాత్రి 2 గంటల సమయంలో అధికారులు, పోలీసులు ప్రవేశించడంతో ఉద్రిక్తత […]

Written By: Dharma, Updated On : April 14, 2023 11:24 am
Follow us on

Gitam University

Gitam University: విశాఖలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గీతం యూనివర్సిటీని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నలువైపులా మోహరించిన పోలీసుల మధ్య ఫెన్సింగ్ సామగ్రితో రెవెన్యూ అధికారులు యూనివర్సిటీ లోపలికి ప్రవేశించారు. వర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోని డెంటల్‌ కాలేజ్‌ వద్ద కిలోమీటర్‌ మేర కంచె వేశారు. కంచె వేసిన స్థలం మొత్తం ప్రభుత్వానిదేనని అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత.. రాత్రి 2 గంటల సమయంలో అధికారులు, పోలీసులు ప్రవేశించడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా ఫెన్సింగ్ కు ఆర్డీవో భాస్కరరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాటికే ఫెన్సింగ్ వేసే పనిలో అధికారులు ఉన్నారు.

గతంలో ఓసారి గీతం యూనివర్సిటీ ఆక్రమణలు తొలగించారు. సుమారు 45ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందని రెవెన్యూ అధికారులు అప్పట్లో తెలిపారు.. గీతం యూనివర్సిటీ లో ఇవాళ జరిగిన పరిణామాలపై ఆర్డీఓ భాస్కర్ రెడ్డి స్పందించారు. . గతంలో ప్రభుత్వ భూమి అని గుర్తించిన దానికే ఫెన్సింగ్ వేస్తున్నట్టు తెలిపారు. ఇది మొత్తం 14ఎకరాల భూమి అన్నారు. గతంలో ఫెన్స్సింగ్గ్ లేదని, ఇపుడు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం గీతం ఎండీగా టీడీపీనేత భరత్ ఉన్నారు. ఈ నేపథ్యంలో గీతంను టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం పలుమార్లు ఆక్రమణల పేరిట తొలగింపులు చేపట్టింది. ఇప్పుడు కూడా అంతే దూకుడు ప్రదర్శించడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.

Gitam University

కంచె ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తరువాత బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు. గీతం కాలేజీకి వెళ్లే అన్ని రూట్లలో ఆంక్షలు కొనసాగాయి. ఎండాడ, రుషికొండ మార్గంలో రెండు కిలోమీటర్ల ముందుగానే బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఐడీ కార్డులను చూపిస్తేనే ఆ మార్గంలో స్థానికులకు విడిచిపెడుతున్నారు.పోలీస్ ఆంక్షలతో నగరవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. అటువైపుగా వెళ్లే కార్మికులు ఇబ్బందిపడ్డారు. అత్యవసర విభాగాలైన పాలు, కూరగాయలు, ఇతరత్రా అవసరాలు రవాణా చేసే వాహనాలను దారి మళ్లించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏసీపీ మూర్తి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.