Homeఆంధ్రప్రదేశ్‌TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

TDP: ఆంధ్రప్రదేశ్ లో నేడు టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అధికారానికి దూరమైన నేపథ్యంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్బవించి నలభై ఏళ్లు అవుతున్న సందర్భంలో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు. ఇందుకు అందరిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

TDP
Chandrababu Naidu

ఇక చంద్రబాబు తరువాత లీడర్ గా కొనసాగేందుకు లోకేష్ కు అవకాశాలు తెస్తున్నా ఆయన మాత్రం తన స్వయంకృతాపరాధంతో కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు.దీనిపై చంద్రబాబు ఆలోచనలో పడుతున్నారు. తన వారసుడిగా లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి పలుమార్లు నవ్వులపాలు అవుతున్నారు. తన తెలివితేటలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకోవాల్సిన నేత అందరిలో గుర్తింపు పొందలేకపోతున్నారు. కార్యకర్తలు లోకేష్ ను తమ భవిష్యత్ నాయకుడిగా చూడటం లేదు. అదే చంద్రబాబుకు బాధ కలిగిస్తోంది. తన కొడుకు సరిగా వ్యవహరిస్తే తనకు ఈ బాధలు ఉండేవి కాదని తల పట్టుకుంటున్నారు.

Also Read: MLA Rajaiah: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య?

మరోవైపు పార్టీని నడిపించాలంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం ఉండాల్సిందేననే వాదన కూడా కార్యకర్తల్లో వస్తోంది. ఇన్నాళ్లు అధికారానికి దూరమైన నేపథ్యంలో ఎన్టీఆర్ వస్తేనే పార్టీ పరిస్థితి మారుతుందని కార్యకర్తలు కోరుతున్నారు. దీనిపై చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన ఆతిథ్యం మాత్రం టీడీపీకి కచ్చితంగా ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టాలంటే సమర్థులైన నాయకులు కావాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఆ సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని తెలుస్తోంది.

TDP
Chandrababu Naidu

బీసీల పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలో కూర్చోబెట్టాలంటే భారీ కసరత్తు ఉండాల్సిందే. నేతల సహకారం తప్పనిసరి. ఇప్పటికే వైసీపీ 151 సీట్లతో అధికారంలో ఉండటంతో దాన్ని దించాలంటే ఇంకా ఎక్కవ శక్తిగల నేతలు ఉండాల్సిందే. వారి మాటలకు ప్రజలు బ్రహ్మరథం పట్టాల్సిందే. అలాంటి వారైతేనే టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తుందని కార్యకర్తలు అభిలషిస్తున్నారు. దీనికి సమర్థుడు కార్యదీక్షాపరుడు అంటే ఎన్టీఆర్ అనే మాట అందరు కార్యకర్తల్లో నానుతోంది.

చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ను ఆహ్వానించి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు ఖరారుచేసుకోవాల్సిన సమయం వచ్చింది. రానున్న రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పటికే ఒక సమగ్ర రూపం రావాల్సిందే. లేకపోతే అప్పటికప్పుడు అంటే కష్టం. అందుకే ఎన్టీఆర్ ను పార్టీ కోసం పని చేయాలని కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి.

Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

3 COMMENTS

  1. […] Chandrababu will Give 40 Percent Tickets To Youth: తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చుకుంది. యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలకు ఉద్భోద చేశారు. యువతతోనే ఏదైనా సాధ్యమని గుర్తించారు. దీని కోసమే వారికి నలభై శాతం టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో యువతలో ఉత్సాహం పెరుగుతోంది. యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం సేవ చేయాలని అభ్యర్థించారు. దీంతో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి పార్టీకి ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. […]

  2. […] Uniform Secretariat Employees: మేము ఏమైనా చిన్న పిల్లలమా? విద్యార్థుల్లా కనిపిస్తున్నామా? ఉద్యోగులమని గుర్తున్నామా? కట్టుబానిసలుగా పరిగణిస్తున్నారా?…ఈ ప్రశ్నలు, ఆవేదనలు, ఆక్రోషాలు ఎవరికి అనుకుంటున్నారా? అదేనండీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రులుగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగులవి. ప్రజలు సచివాలయ ఉద్యోగులను సులభంగా గుర్తించేందుకు ప్రభుత్వం వారికి యూనిఫారం తప్పనిసరి చేసింది. ఉగాది నుంచి విధిగా ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. 2019 అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించింది. 19 శాఖలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది సచివాలయ ఉద్యోగులను నియమించింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఎంపిక చేసింది. గాంధీ జయంతి నాడు విధుల్లో చేరిన వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ గా నిర్ణయించింది. ఈ లెక్కన 2021 అక్టోబరుతో వీరి ప్రొబేషనరి పీరియడ్ పూర్తయ్యంది. కానీ వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించలేదు. పైగా ప్రొబేషనరీ డిక్టరేషన్ పరీక్షలంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. మరో ఆరు నెలల పాటు ప్రొబేషనరీ పిరియడ్ ను పొడిగించింది. దీంతో అతి కష్టమ్మీద ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారికి స్వాంతన కలిగే నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి యూనిఫారం అంటూ ఒత్తిడి చేస్తున్నారు. యూనిఫారం ధరించని వారిపై శాఖ పరమైన చర్యలుంటాయని చెప్పడం ద్వారా బలవంతపు వస్త్రధారణ చేసేలా చేయడంపై ఉద్యోగుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular