https://oktelugu.com/

Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం.. ఆ రోజే ఎందుకంటే ?

  Telangana Secretariat: వాస్తు సక్రమంగా లేదనో.. ఆ భవనంలోకి వెళితే పదవీ గండం, ప్రాణ గండం ఉంటుదన్న ఆలోచనతో 9 ఏళ్లుగా సచివాలయం గడప తొక్కని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పాత సచివాలయం పనికి రాదని దానిని కూల్చి సుమారు రూ.617 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారు. కనీవిని ఎరుగని రీతిలో.. అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక కెమెరాలు, లైట్లు, ఏసీలు బిగించారు. ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ విలాసవంతమైన భవనాన్ని తన పుట్టిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 9, 2023 / 03:36 PM IST
    Follow us on

     

    Telangana Secretariat

    Telangana Secretariat: వాస్తు సక్రమంగా లేదనో.. ఆ భవనంలోకి వెళితే పదవీ గండం, ప్రాణ గండం ఉంటుదన్న ఆలోచనతో 9 ఏళ్లుగా సచివాలయం గడప తొక్కని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పాత సచివాలయం పనికి రాదని దానిని కూల్చి సుమారు రూ.617 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారు. కనీవిని ఎరుగని రీతిలో.. అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక కెమెరాలు, లైట్లు, ఏసీలు బిగించారు. ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ విలాసవంతమైన భవనాన్ని తన పుట్టిన రోజు ఫిబ్రవరి 17న ప్రారంభించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈమేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ భవనాన్ని కేసీఆర్‌ సొంత డబ్బులతో నిర్మించినట్లుగా తన పుట్టిన రోజు ప్రారంభించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టామని గొప్పలు చెబుతున్న కేసీఆర్‌ అంబేద్కర్‌ పుట్టిన రోజు అయిన ఏప్రిల్‌ 14న ప్రారంభించాలన్న డిమాండ్‌ వస్తోంది.

    Also Read: Rahul- Gill: ఫామ్‌లేని ప్లేయర్‌కు టీమిండియాలో స్థానం.. సెంచరీల హీరోకు అన్యాయం..!

    సంక్రాంతికే ప్రారంభించాలనుకున్నా..
    వాస్తవానికి… సంక్రాంతికే కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మొదట భావించింది. అయితే పనులు పూర్తి కాకపోవడం, మరోవైపు జనవరి 18న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, రెండో విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేశారు. తర్వాత దానిని కేసీఆర్‌ పుట్టిన రోజే ప్రారంభించాలని నిర్ణయించడంపై ఇప్పుడు వివాదం నెలకొంది.

    20 ఎకరాల్లో రూ.617 కోట్లతో నిర్మాణం..
    తెలంగాణ కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా కొత్త సెక్రటేరియట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌తో అధునాతనంగా భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. 8 అంతస్తులతో కూడిన భవనం… ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. సీఎం కార్యాలయానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన అంతస్తుల్లో మంత్రుల చాంంబర్లు, వివిధ విభాగాలు, సహాయక సిబ్బంది, సమావేశ గదులు, సాధారణ పరిపాలనా విభాగం కోసం కేటాయిస్తారు. దిగువ అంతస్తులలో పెద్ద సమావేశ మందిరాలు, వీవీఐపీల వెయిటింగ్‌ ప్రదేశాలు, పోలీసు నిఘాలు, ఇంటెలిజెంట్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ రికార్డ్‌ రూంలు, స్టోర్‌ మొదలైనవి ఉంటాయి.

    భవనం మెుత్తం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మితమవుతోంది. ప్రధాన ప్రవేశం తూర్పు వైపున ఉంది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది.

    తుది మెరుగులు..
    సచివాలయ భవనానికి సంబంధించిన సివిల్‌ వర్క్స్‌ పూర్తయ్యాయి. తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఫ్లోరింగ్, ఫాల్‌ సీలింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం, పోర్టికో, భవనం ఆవరణ, ముందు ఉన్న లాండ్‌ స్కేప్‌ గార్డెన్ల పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం విధించిన గడువులగా పనులు పూర్తి చేసేందుకు మూడు షిఫ్ట్‌ల్లో పనులు చేస్తున్నారు. నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తరచూ సచివాలయ పనులను పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడంతోపాటు వేగవంతం కోసం ఆదేశాలు ఇస్తున్నారు. ఇటీవలే భవనంలో అగ్నిప్రమాదం కూడా జరిగింది. అయితే అది మాక్‌డ్రిల్‌ అని పోలీసులు, ప్రమాదమే అని మంత్రి వేర్వేరుగా ప్రకటించారు.

    Telangana Secretariat

    ఫిబ్రవరి 17నే ఎందుకంటే..
    ఇక ఫిబ్రవరి 17వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. 1954లో ఈ తేదీన కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మించారు. ఇక సెంటిమెంట్‌ను బలంగా నమ్ముకునే కేసీఆర్‌ జన్మరాశి కర్కాటకం. జన్మ నక్షత్రం ఆశ్లేష. ఆయన లక్కీ నంబర్‌ ఆరు. సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభించడానికి ఒక కారణం కేసీఆర్‌ పుట్టిన రోజు ఒకటి అయితే.. ఆరోజు త్రయోదశి.. ఉత్తరాషాడ నక్షత్రం. ఉదయం 10:05 నుంచి 11:02 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది. ఇవి కేసీఆర్‌కు కలిసి వచ్చే గడియలు.

    హైకోర్టులో పిల్‌..
    కేసీఆర్‌ పుట్టినరోజు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ ౖహైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టినందున ఆ మహనీయుడి పుట్టిన రోజే ప్రారకంభించాలని కోరారు. ప్రతివాదులుగా సీఎంవో, చీఫ్‌ సెక్రటరీలను చేర్చారు. పార్టీ ఇన్‌ పర్సన్‌గా పాల్‌ వాదనలు వినిపిస్తామని తెలిపారు. తన పిల్‌ విచారణకు రాకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని కూడా ఆరోపించారు. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

    Also Read: Botsa Satyanarayana- Jagan: బొత్సకు భయపడుతున్న జగన్

    Tags