కరోనా ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 31నుంచి 6తేదివరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వీటిని వాయిదా వేస్తున్న తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి పదోతరగతి పరీక్ష వాయిదా పడటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీగా తెలంగాణ : కేసీఆర్
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 70పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇందులో 11మందికి టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించారు. వీరిని మరోసారి టెస్ట్ చేసి డిశార్చ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిలో 7తేదిలోగా తెలంగాణ కరోనా ఫ్రీగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో రేపటి నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలు కేవలం రెండే జరిగాయి. కేవలం లాంగ్వేజ్ కి సంబంధించిన పరీక్షలను విద్యాశాఖ నిర్వహించారు. ఇంకా మేయిన్ పరీక్షలైన గణితం, సైన్స్, సాంఘీక వంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని.. ప్రస్తుత సెలవులను ప్రిపరేషన్స్ కు వినియోగించుకోవాలని సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి కొత్త తేదిని ప్రకటించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.