Telangana: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. పెట్రోధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని తెలుసుకున్న సంస్థ ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థల మనుగడ దృష్ట్యా చార్జీల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ప్రజలపై భారం విధించేందుకే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో త్వరలో రెండు సంస్థల చార్జీలు పెంచేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు.
పెట్రో ధరల పెరుగుదలతో ఆర్టీసీ మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పరిస్థితి తయారైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చార్జీ లపెంపు ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై సుమారుగా రూ.3 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలుస్తోంద. ఈ విపత్తు నుంచి బయట పడటానికి సంస్థ చార్జీలు పెంచడమే పరిష్కారమని చెబుతోంది. దీనికి నేతలు కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.
ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు రూ. 90 కోట్ల ఆర్థిక నష్టం కలుగుతుందని అంచనా. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 97 డిపోలు కూడా నష్టాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చార్జీల పెంపుతో ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు వచ్చాయని ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతోనే సీఎం శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చార్జీలు పెంచుకోవడం తప్ప వేరు మార్గం లేదని తెలుస్తోంది. ఆర్టీసీని పటిష్టం చేసే దిశగా చార్జీల పెంపే అత్యవసరమని చెప్పారు. ఆర్టీసీని పట్టాలెక్కించే పనిలో భాగంగానే చార్జీల పెంపును గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ తిరిగి నష్టాల్లోకి వెళితే రక్షించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం సైతం సంస్థను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుందని చెబుతోంది. ఇందులో భాగంగానే చార్జీల పెంపునకు సైతం తమ నిర్ణయం వెలువరించామని చెబుతోంది.