https://oktelugu.com/

Maa Bhoomi: చరిత్రతో వచ్చి చరిత్ర సృష్టించింది.. నిజాం నిరంకుశత్వంపై నినదించిన సినిమా ‘మా భూమి’

Maa Bhoomi: తెలంగాణలో భూస్వాములు, పెత్తందారుల అకృత్యాలకు ముగింపు పలికింది సాయుధ రైతాంగ పోరాటం. దొరలను గడీల నుంచి తరిమికొట్టింది. ప్రజల తిరుగుబాటుతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత 1948, సెప్టెంబర్‌ 17న తెలంగాణకు నిజాం నుంచి విముక్తి కలిగింది. దీనిని విమోచనమన్నారు.. విలీనమన్నారు… విద్రోహమన్నారు… చివరకు సమైక్యతా దినం అంటున్నారు. ఏ పేరు పెట్టుకున్న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చింది అన్నది నిజం. కబంధ హస్తాలతో ప్రజాపోరాటాన్ని అణచివేయాలనుకున్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 17, 2022 / 01:34 PM IST
    Follow us on

    Maa Bhoomi: తెలంగాణలో భూస్వాములు, పెత్తందారుల అకృత్యాలకు ముగింపు పలికింది సాయుధ రైతాంగ పోరాటం. దొరలను గడీల నుంచి తరిమికొట్టింది. ప్రజల తిరుగుబాటుతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత 1948, సెప్టెంబర్‌ 17న తెలంగాణకు నిజాం నుంచి విముక్తి కలిగింది. దీనిని విమోచనమన్నారు.. విలీనమన్నారు… విద్రోహమన్నారు… చివరకు సమైక్యతా దినం అంటున్నారు. ఏ పేరు పెట్టుకున్న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చింది అన్నది నిజం. కబంధ హస్తాలతో ప్రజాపోరాటాన్ని అణచివేయాలనుకున్న ఆరాచకంపై జనం తిరబడ్డది చరిత్ర. ‘ఆపరేషన్‌ పోలో’ కంటే ముందే జనమే సాయుధులై రజాకార్లను ఉరికించింది వాస్తవం. వెట్టిచాకిరీ, దొరల దురహంకారం, మహిళలపై అత్యాచారం, వెట్టిచాకిరీ ఇలా 75 ఏళ్ల క్రితం జరిగిన దారుణాలను కళ్లకు కట్టిన సినిమా మా భూమి. సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసిన పరిస్థితులు, తర్వాత జరిగిన సంఘటనలను ఈ సినిమా కళ్లకు కట్టింది. ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. జనం కష్టాలు, కన్నీళ్లు, అణచివేత నుంచి పుట్టిన నిప్పు కణిక మా భూమి సినిమా. సినిమా విడుదలై 42 ఏళ్లు అయినా ఈ సినిమాను ఎవరూ మర్చిపోవడం లేదు.

    Maa Bhoomi

    జాతీయ, అంతర్జాతీయ చర్చ..
    జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా భూమి సినిమా చర్చనీయాంశం అయింది. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్‌ యాక్షన్‌ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్‌ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది. నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రజలు ఎదురు తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సినిమా వివరించింది. చైతన్యం రగిల్చింది. స్ఫూర్తిగా నిలిచింది.
    Also Read: Telangana Movement 1948: నిజాం నిరంకుశంపై.. తెలంగాణ అంకుశం: సాయుధ పోరాటంలో ప్రతిఘట్టం అద్వితీయమే

    అదొక ప్రయోగం..
    ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం. 1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 ఏళ్లు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్‌ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది.

    Maa Bhoomi

    హైదరాబాద్‌లో చిత్రీకరణ…
    మా భూమి సినిమాను చాలా వరకు మొదక్‌ జిల్లా మంగళ్‌పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించారు. విద్యుత్‌ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్‌ చేశారు. రజాకార్ల దాడి, కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్‌ బాటిల్‌ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్‌ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్‌లో ఒక సన్నివేశాన్ని తీశారు. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్‌జంగ్‌ మ్యూజియం, కాలాగూడ తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశారు. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్‌ వేశారు.

    Maa Bhoomi

    సినిమా బడ్జెట్‌ రూ.4.5 లక్షలే..
    ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున రెమ్యునరేషన్‌ ఇచ్చారు. చాలా మంది స్వచ్ఛందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్‌ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్‌లో భాగస్వాములను చేశారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది.
    Also Read:
    Bigg Boss 6 Telugu- Sri Satya: బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య గురించి ఈవిషయాలు మీకు తెలుసా..

    బండెనుక బండి కట్టి…
    ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్‌ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా….’ అంటూ గద్దర్‌ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది.

    Tags