Malla Reddy: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ను ఆ పార్టీ మంత్రే భయపెడుతున్నాడా.. ఆయనతో పార్టీకి ముప్పు పొంచి ఉందా. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ ఓటమి ఖాయమా? అంటే అవుననే అంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. డబ్బు.. పలుకుబడి ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అన్నీకూడా అనుకూలించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కీలక మంత్రి మల్లారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో విజయందక్కించుకున్న మల్లారెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం కల్పించారు.
పూర్తిగా వ్యతిరేకత..
ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా మల్లారెడ్డి అందరికీ సుపరిచితులే అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అంతగా సానకూల పవనాలు, పరిస్థితి కూడా కనిపించడం లేదన్నదు. ఇటీవల మల్లారెడ్డి ఏదో ఒక విషయంలో తరచూ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. తన సంస్థల్లో ఐటీ దాడులు చేసినప్పుడు.. తర్వాత కాలేజీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయడం ద్వారా.. తీవ్ర విమర్శలు. .కేంద్రంపై విరుచుకుపడడం ద్వారా ఆయన మీడియా దృష్టి ని ఆకర్షించారు.
ఇక, అదేసమయంలో కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తారంటూ.. ఆయనే ప్రధాని అవుతారంటూ కూడా వ్యాఖ్యలుచేశారు. అయితే.. ఇంత చేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా మల్లారెడ్డి వార్తల్లో నిలుస్తున్నా మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం మల్లారెడ్డికి సెగ బాగానే తలుగుతోంది. సొంత పార్టీ నేతలే ఆయనను దూరం పేడుతున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు పెరిగింది.
టికెట్ ఇవ్వొద్దంటున్న సొంత పార్టీ నేతలు..
గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా మల్లారెడ్డి 87 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మేడ్చల్ బీఆర్‌ఎస్ నేతలే.. పార్టీకి వర్తమానాలు పంపుతున్నారు. ఆయన కాకుండా.. ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామంటూ కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా.. కబురు పెడుతుండడంతో అసలు మల్లారెడ్డి పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది.
అయితే మల్లారెడ్డి ప్రస్తుతం కేసీఆర్ వర్గంలో ఉన్నారనే టాక్ ఉంది. దీంతో కేటీఆర్‌కు మల్లారెడ్డికి మధ్య మాటలు కూడా లేవు. ఇంకోవైపు బీఆర్‌ఎస్ నేతలు మల్లారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Telangana minister mall reddy doubt in brs ticket in assemble contest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com