Homeఆంధ్రప్రదేశ్‌KCR vs BJP: దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!

KCR vs BJP: దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!

KCR vs BJP: దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌.. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.. కేసీఆర్ త‌న ప్ర‌సంగంలో ప‌దే ప‌దే చెప్పే మాట‌లు ఇవి. అయితే ఇన్ని రోజులు కేవ‌లం కేసీఆర్ ఒక్క‌డే ఈ మాట‌లు చెబుతున్నాడ‌ని, డ‌బ్బా కొట్టుకుంటున్నాడ‌ని అంతా విమ‌ర్శించేవారు. అయితే ఇప్పుడు కేంద్ర సంస్థ‌లు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి. దీంతో కేసీఆర్ చెప్పిన మాట‌లు ఇప్పుడు నిజం అవుతున్నాయి.

KCR Modi Fight
KCR Modi Fight

ఈ ఏడాది కాలంలో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని కేంద్ర సంస్థ‌లు చెబుతున్నాయి. దీన్ని జీఎస్‌డీపీగా చెప్పొచ్చు. దాని అర్థం ఏంటంటే రాష్ట్ర సంపద అని. ఇలా రాష్ట్ర సంప‌ద‌లో దాదాపు 20శాతం ఈ ఏడాది న‌మోద‌యింద‌ని కేంద్ర సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. దేశంలోనే ఎక్కువ‌గా 19 శాతం వ‌ర‌కు వృద్ధిరేటు సాధించింది తెలంగాణ ప్ర‌భుత్వం.

Also  Read:  కాపు నాయకులపై ఎన్నో అనుమానాలు?

ఈ లెక్క‌న రాష్ట్రంలో ఒక్కొక్క‌రు రూ.2 లక్షల 78 వేల దాకా సంపాదిస్తున్నార‌ని తెలుస్తోంది. గ‌త అంత‌కు ముందు ఏడాదిలో తెలంగాణ ప్ర‌జ‌లు క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా.. జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2.25 శాతమే ఉంది. కానీ ఈ ఏడాది కాలంలో జీఎస్ డీపీ విప‌రీతంగా పెరిగింది. గ‌తం కంటే కూడా 17 శాతం అత్య‌ధికంగా న‌మోదు అయింది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రం కార‌ణంగానే ఈ వృద్ధిరేటు న‌మోదు అయింది.

CM KCR National Politics
CM KCR National Politics

అయితే ఇప్పుడు ఈ వార్త టీఆర్ ఎస్‌కు పెద్ద ఆయుధంలా మారే ఛాన్స్ ఉంది. కేంద్ర సంస్థ‌లే త‌మ పాల‌న ఎలా ఉందో చెప్తున్నాయ‌ని ప్ర‌చారం చేసుకునే ఛాన్స్‌. అంతిమంగా బీజేపీకి ఇది పెద్ద ఎఫెక్ట్‌. అటు కాంగ్రెస్‌కు కూడా ఇది న‌ష్టం చేకూర్చే అవ‌కాశం ఉంది. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో.. ఇలాంటి రికార్డు సాధించ‌డం బాగా క‌లిసి వ‌స్తుంద‌నే చెప్పుకోవాలి. మ‌రి కేసీఆర్ దీన్ని జాత‌యరాజ‌కీయాల్లో ఎలా వాడుకోవాలో ప్లాన్ చేసే ప‌నిని పీకేకు ఇచ్చే అవ‌కాశం ఉంది.

Also  Read:  ఓటీటీలు ఉన్నప్పుడు ఇక టీవీ చానెళ్లు ఎందుకు దండగ 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

4 COMMENTS

  1. […] Photo Morphing‌ Scams:  ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లోనూ, బయట సమాజంలోనే కాకుండా చివరికి సోషల్ మీడియాలో కూడా వారికి వేధింపులు తప్పట్లేదు. పెరుగుతున్న టెక్నాలజీ కూడా వారికి శాపంగా మారుతుంది. చాలాసార్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో వారితో ఫ్రెండ్షిప్ చేసి చివరికి వారిని మోసం చేస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. […]

  2. […] Traffic Challan Telangana:  బైకు, లేదా కార్ మీద ఉన్న చలాన్ లను కట్టలేక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇప్పుడు పోలీస్ శాఖ తీసుకు వచ్చిన బంపర్ ఆఫర్ ను వినియోగించుకోండి. ఈ రోజు నుంచి మార్చి 30 వరకు మీకు అవకాశం ఉంది. వాహనాల మీద ఉన్న పెండింగ్ చలాన్ లను ను ఎలాగైనా వసూలు చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ లను మొత్తం కట్టమంటే వాహనదారులు కట్టట్లేదు కాబట్టి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular