TS Inter Results 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఫలితాలను ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను వచ్చేశాయి.
ఉత్తీర్ణత ఇలా..
ఈ ఏడాది ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 67.26 శాతం మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ లో మేడ్చల్ జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం దక్కింది. తర్వాత రంగారెడ్డి, కుమురంభీ జిల్లాలు ఉన్నాయి. సెకండియర్ లో.. ములుగు జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. కుమురంభీం జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
బాలికలదే పైచేయి..
ఇక ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా, 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.
9.06 లక్షల మంది విద్యార్థులు..
ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌కు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. మొత్తం 9.06 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
ఈ కింది వెబ్ సైట్స్ లో మీ ఫలితాలు చూసుకోండి
వెబ్‌సైట్లు https://tsbie.cgg.gov.in/ ద్వారా లేదా http://www.manabadi.co.in/