
Chiranjeevi: ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా తనపని తానూ చేసుకుంటూ వెళ్లే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త వివాదం లో చిక్కుకున్నాడు. ఈరోజు ఆయనకీ తెలంగాణ హై కోర్ట్ నోటీసులు పంపించిన సంఘటన అభిమానుల్లో ఆందోళన కలిగించింది.అసలు విషయానికి వస్తే ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని చిరంజీవి విక్రయించాడు అంటూ గతం లో ఒక పిటిషన్ నమోదు అయ్యింది.ఈ పిటిషన్ ని విచారించిన హై కోర్టు ఆ స్థలం లో ఎలాంటి కట్టడాలు కట్టడానికి వీలు లేదంటూ స్టే ఆర్డర్ ఇచ్చింది.
జూబిలీ హిల్స్ లోని 595 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక స్థలాన్ని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ అమ్మగా చిరంజీవి కొనుగోలు చేసాడు.అక్కడ కొద్దిరోజుల క్రితం నుండి ఒక నిర్మాణం చేపడుతున్నాడు చిరంజీవి, అయితే అది ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలం అని,దానిని ఎలా కొనుగోలు చేసారు?, అందులో ఎలాంటి కట్టడాలు చెయ్యడానికి వీలు లేదు అంటూ జె.శ్రీకాంత్ బాబు తదితరులు హై కోర్టుని ఆశ్రయించారు.
ఈ స్థలం GHMC పరిథిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని శ్రీకాంత్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత హై కోర్టు అక్కడ జరుగుతున్నా నిర్మాణాలను ఆపాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.వెంటనే కౌంటర్ పిటిషన్ దాఖా చేసి వివరణ ఇవ్వాలంటూ కోర్టు కోరింది.ఈ కేసు పై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
మరో వైపు చిరంజీవి ఫ్యాన్స్ ఈ కౌరు నోటీసు పై ఫైర్ అవుతున్నారు.చిరంజీవి పై కావాలని కుట్రలు చెయ్యడానికి ఒక వర్గం ఆయనని చేదు చెయ్యాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుందని, అందులో భాగంగానే ఇలాంటి దుష్ప్రచారాలు చేసి ఆయన ఇమేజి పై మరకతెచ్చే నీచపు చర్య అంటూ విరుచుకుపడుతున్నారు.ప్రజాసేవ చెయ్యడానికి ఎప్పుడూ ముందు ఉండే చిరంజీవి పొరపాటున కూడా ఇలాంటి పనులు చెయ్యదు అంటూ వివరణ ఇస్తున్నారు ఫ్యాన్స్.