https://oktelugu.com/

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై హైకోర్టు సంచలనం

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని రాష్ర్ట హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. మే 1 నుంచి 14 వరకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దీంతో రాష్ర్టంలో కరోనా పరీక్షల వివరాలు అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారో వివరాలు అందజేయాలని సూచించింది. రోజుకు కనీసం లక్ష పరీక్షలు చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం […]

Written By: , Updated On : May 17, 2021 / 06:31 PM IST
Follow us on

HC About Corona
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని రాష్ర్ట హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. మే 1 నుంచి 14 వరకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దీంతో రాష్ర్టంలో కరోనా పరీక్షల వివరాలు అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారో వివరాలు అందజేయాలని సూచించింది. రోజుకు కనీసం లక్ష పరీక్షలు చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ట ధరలు ఎలా ఖరారు చేశారని ప్రశ్నించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించింది.

వాస్తవాలకు అనుగుణంగా..
ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలపై వెబ్ సైట్ల వివరాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండడం లేదనే పిర్యాదులు వస్తున్నాయని ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలపై ముగ్గురు సభ్యుల కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబ్బందికి వెంటనే వేతనాలు అందజేయాలని సూచించింది.

లాక్ డౌన్ అమలుపై..
కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలుపై డీజీపీ వివరించారు. మే 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

సీపీలకు అభినందనలు
లాక్ డౌన్, కర్ఫ్యూ అమలుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లాక్ డౌన్ వీడియోగ్రఫీన ముగ్గురు కమిషనర్లు కోర్టుకు సమర్పించారు. కేసులు, వ్యాక్సినేషన్ పూర్తిపై కోర్టుకు నివేదిక అందజేశారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను కోర్టు అభినందించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించారని తెలిపింది.

హైకోర్టు ఆగ్రహం
మల్లాపూర్ లో గర్భిణి మృతి చెందిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రులు సకాలంలో స్పందించి వైద్యం అందించి ఉంటే ఆమె చనిపోయి ఉండేది కాదని స్పష్టం చేసింది. జిల్లాల్లో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. లాక్ డౌన్ సమయంలో ఉచిత భోజనం అందజేసి వైద్య సదుపాయాలు కల్పించాలని అభిప్రాయపడింది. కమ్యూనిటీ కిచెన్ల వివరాలు వెబ్ సైట్లలో ఉంచాలని సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని తెలిపింది.