Telangana Govt Set Up Krishna Raju Statue: తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. రెబల్ స్టార్ మరణవార్త అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కృష్ణంరాజు గారి మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని తెగ ఆరాట పడుతుంది.
ఇందులో భాగంగానే.. హైదరాబాద్ ఫిలిం సిటీలో లో కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చాడు. మహానటుడు ఏఎన్నార్ చనిపోతే పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు కృష్ణంరాజు గారి పై మాత్రం ఎందుకు ఇంతగా కపట ప్రేమ చూపిస్తోంది. నిజానికి హైదరాబాద్ ఎదుగుదలలో ఏఎన్నార్ పాత్ర కూడా ఉంది.
Also Read:
Pakistan- Masood Azhar: మసూద్ అజహర్ ను దాస్తున్న పాకిస్తాన్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను మళ్ళీ ఎర్రిపప్పను చేస్తోంది
టాలీవుడ్ హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం ఏఎన్నారే. ఆయన కారణంగానే నేడు హైదరాబాద్ ఇండియాలో బెస్ట్ ఫిల్మ్ హబ్ గా మారింది. అలాంటి మహనీయుడు చనిపోయినా పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం, మరి కృష్ణంరాజు గారి చనిపోతే మాత్రం, ఎందుకు అంతగా రియాక్ట్ అవుతుంది. దీని వెనుక ఉన్న మతలబు ఏమై ఉంటుంది ?, హైదరాబాద్ లో బీజేపీ బలపడుతుంది.
కాబట్టి.. బీజేపీ సానుభూతి పరులను, అలాగే తటస్థ పరులను ఆకట్టుకోవాలి. అన్నిటికీ మించి హైదరాబాద్ లోని సెటిలర్లను మెప్పించాలి. ఆంధ్రా జిల్లాల నుంచి స్థిరపడిపోయిన వారు హైదరాబాద్ జనాభాలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు సగం మంది వరకూ సెటిలర్లే అని ఓ అంచనా కూడా ఉంది. ఇప్పుడు వారంతా బీజేపీ వైపే ఉన్నట్టు తెలుస్తోంది.
అందులోనూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఎదురుకానుంది. అందుకే, ఆంధ్రా అంటేనే మండిపడే.. టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు ఆంధ్రాకి చెందిన వారి పై ఇలా తెగ ప్రేమను కురిపించేస్తున్నారు. మొత్తమ్మీద కేసీఆర్ హైదరాబాదీలను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. అందులో భాగంగానే కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతుంది తెలంగాణ ప్రభుత్వం.
Also Read: Supreme Court- Gali Janardhana Reddy: సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా ఈ బీజేపీ మైనింగ్ డాన్ అవినీతి కనపడదా సార్లు?