National Integration Day: తెలంగాణ సీఎం కేసీఆర్ అదును చూసి దెబ్బకొట్టడంలో సిద్ధహస్తుడు.. ఆయన చర్యలు ఊహకు అందవు. నయీం ఎన్ కౌంటర్ కానీ.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బుక్కైపోవడం కానీ.. దిశా నిందితుల ఎన్ కౌంటర్ కానీ అప్పటివరకూ ఎవరికీ తెలియవు.. అంత పకడ్బందీగా కేసీఆర్ ప్లాన్ చేస్తాడు.. దెబ్బ కొడుతాడు. ఇప్పుడు బీజేపీకి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ఘనత దక్కకుండా కేసీఆర్ వేసిన ఎత్తుగడ టీఆర్ఎస్ దృష్టిలో గొప్ప స్టెప్ అనుకోవాలి.. అదే బీజేపీకి చావుదెబ్బగా చెప్పొచ్చు.
సెప్టెంబర్ 17.. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం. దీన్ని కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు కలిసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ను షేక్ చేసేలా కార్యక్రమాలు చేపట్టారు. కానీ తెలివిగా కేసీఆర్ ఈరోజును ‘జాతీయ సమైక్యత దినం’గా ప్రకటించి తాను తెలంగాణ విమోచనం విషయంలో పాటుపడుతున్నట్టు కలర్ ఇచ్చాడు. కానీ సెప్టెంబర్ 17న ఈరోజు సెలవు ప్రకటించి బీజేపీకి, అందరికీ షాక్ ఇచ్చాడు.
సెప్టెంబర్ 17న అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి ఈరోజు ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది. ప్రభుత్వం కూడా ఇదే పనిచేయడానికి సిద్ధమైంది. కానీ టీఆర్ఎస్ ను మించి బీజేపీ దూసుకురావడంతో కేసీఆర్ ప్లాన్ బి అమలు చేశారు. బీజేపీకి మైలేజ్ రాకుండా.. ఆ పార్టీకి బలమైన యువత, విద్యార్థులను ఇందులో పాల్గొననీయకుండా పకడ్బందీ ప్లాన్ చేశాడు. అదును చూసి దెబ్బకొట్టాడు.
నిన్న రాత్రి ఆగమేఘాలపై సెప్టెంబర్ 17న విమోచన దినం సందర్భంగా విద్యాసంస్థలన్నింటికి సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థి లోకం అంతా ఇంటికే పరిమితం అవుతారు. బీజేపీ నిర్వహించే విమోచన వేడుకల్లో పాల్గొనరు. ఆ ఊపు రాదు. సో పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ విద్యార్థులను, యువతను దూరం చేయడానికి ఈరోజు సెలవు ప్రకటించడం సంచలనమైంది.
దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ‘తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని’ ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని కేంద్రం పిలుపునిస్తే.. అందుకు భిన్నంగా జెండా ఎగురనీయకుండా సెలవు ప్రకటించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. ఇదేనా సీఎం కేసీఆర్ కు ఉన్న నిబద్ధత? అంటూ ప్రశ్నించాడు.
Also Read: Krithi Shetty: జనసేన ప్రచారంలో బేబమ్మ… ఆమె ఆన్సర్ కి పవన్ ఫ్యాన్స్ ఫిదా!
ఇలా తెలంగాణలో బీజేపీకి మైలేజ్ వచ్చే ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతంగా అడ్డుకుంటూ కేసీఆర్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారు. అధికార బలంతోనే ఇదంతా చేస్తున్నారు. 2023 ఎన్నికల వరకూ కేసీఆర్ ఎత్తులు పనిచేస్తాయా? బీజేపీ ఎలాంటి ప్లాన్లు అవలంభిస్తుంది? వీరిద్దరి ఫైట్ లో గెలిచేదెవరు అన్నది వేచిచూడాలి.