Tinmar Mallanna : సత్యం వధ, ధర్మం చెర: తీన్మార్ మల్లన్నపై ఇదీ సర్కారు పగ

Tinmar Mallanna : తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి. కొలువులు దక్కుతాయి. నిధులు అందుతాయి. నియామకాలు లభిస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ జరుగు తున్నది వేరు. ప్రాంతేతరుడు పాలిస్తే పాతరేస్తాం. ప్రాంతీయుడే అణచివేస్తే తొక్కి పారేస్తాం’ అని కాళోజీ నా గొడవలో రాశారు. మొదటి దాని అంతం కోసం తెలంగాణ కదిలింది. దానిని మలి దశ ఉద్యమంలో కొనసాగించింది. రెండో దాని అంతం కోసం ఇప్పుడు పోరాడుతోంది. చెప్పేదుకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది ముమ్మాటికీ […]

Written By: Bhaskar, Updated On : March 23, 2023 9:29 pm
Follow us on

Tinmar Mallanna : తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి. కొలువులు దక్కుతాయి. నిధులు అందుతాయి. నియామకాలు లభిస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ జరుగు తున్నది వేరు. ప్రాంతేతరుడు పాలిస్తే పాతరేస్తాం. ప్రాంతీయుడే అణచివేస్తే తొక్కి పారేస్తాం’ అని కాళోజీ నా గొడవలో రాశారు. మొదటి దాని అంతం కోసం తెలంగాణ కదిలింది. దానిని మలి దశ ఉద్యమంలో కొనసాగించింది. రెండో దాని అంతం కోసం ఇప్పుడు పోరాడుతోంది. చెప్పేదుకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రీ ఉపయోగించిన రీతిలో పోలీస్‌ వ్యవస్థ ను కేసీఆర్‌ ఉపయోగిస్తున్నారు. తన కూతురు మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కుపోయి, రాష్ట్రం పరువు తీసినప్పటికీ వీసమెత్తు స్పందించని ముఖ్యమంత్రి.. ఈడీ విచారించిన సందర్భాల్లో తెలంగాణ ఇంటలిజెన్స్‌ పోలీసులను అక్కడికి పంపడం విశేషం. ఇక ఈ మద్యం కుంభకోణంలో అసలు విషయాలను వెలుగులోకి తెస్తున్న క్యూ న్యూస్‌ ఎండీ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై ప్రభుత్వం దాష్టీకాన్ని ప్రదర్శించడం గమనార్హం.

ఉదయం లేస్తే కేసీఆర్‌ నుంచి కేటీఆర్‌ దాకా ప్రతిపక్షాలపై మోదీ దాష్టీకం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తారు. హైదరాబాద్‌లో తెర వెనుకు ఉండి పోస్టర్లు వేయి స్తారు. ఇక అనుకూల మీడియా గురించి చెప్సాల్సిన పని లేదు. సొంత మీడియాలో తాటికాయంత అక్షరాల గురించి వివరించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగా ణలో తాము ఎంతటి దాడులకు పాల్పడుతున్నామో కేసీఆర్‌ అండ్‌ కో చెప్పదు. తన సొంత మీడియాలో కనసీం ప్రతిపక్షాలకు కొంచెం కూడా స్పేస్‌ ఇవ్వదు. పైగా నీతులు మాత్రం చెబుతుంది. ప్రశ్నించిన గొంతు లను అణచివేస్తుంది. అలా ఇప్పుడు క్యూ న్యూస్‌ ఎండీ తీన్మార్‌ మల్లన్నను అలానే అణచివేస్తోంది.

ఇటీవల కొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు(మన్నె క్రిషాంక్‌ అనుచరులు) క్యూ న్యూస్‌ కార్యాలయంలోకి చొరపడ్డారు. అకారణంగా దాడులు చేశారు. ఆ సమయంలో తీన్మార్‌ మల్లన్న ఆఫీస్‌లో లేడు. ఈ దాడులు చేసిన వ్యక్తుల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈక్రమంలో తీన్మార్‌ మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇక్కడ పోలీసులు బాధితుడి పక్షాన ఉండకుండా దాడి చేసిన వ్యక్తుల వైపు ఉన్నారు. దాడులు చేసిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో మల్లన్న అతడి అనుచరులను ఎటువంటి వారెంట్‌ లేకుండా అదుపులోకి తీసుకున్నా రు. రాత్రికిరాత్రే మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలిం చారు. హయత్‌నగర్‌ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇక అతడికి బెయిల్‌ కోసం శరత్‌ అనే లాయర్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ పోలీసులు రోజుకో నిబంధన విధిస్తున్నారు. దీంతో అతడు విసిగివేసారి సోషల్‌ మీడియాలో తన ఆవేదనను పోస్ట్‌ చేశాడు. ‘తెలంగాణ ఉద్యమంలో పని చేశా. ఎంతో మందికి బెయిల్‌ ఇప్పించా. కానీ ఇంతటి దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చవి చూడలేదు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? దీనికోసమేనా తెలంగాణ ఉద్యమం చేసింది?’ అని తన బాధను పంచుకున్నాడు. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.