Telangana Election Results 2023: రేవంత్ ను కలుస్తావా? డీజీపీని సస్పెండ్ చేసి షాకిచ్చిన ఈసీ

ఒక పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్న టీపీసీసీ చీఫ్‌ చేవంత్‌రెడ్డిని రాష్ట్ర పోలీస్‌ బాస్‌ అంజనీకుమార్‌ కలవడంపై విమర్శలు వెల్లువెత్తడంతోపాటు ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతండగానే డీజీపీ రేవంత్‌ను కలవడంపై బీజేపీ అభ్యతరం వ్యక్తం చేసింది.

Written By: Raj Shekar, Updated On : December 3, 2023 6:12 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ వేళ సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే దంతులు, మామా అలు‍్లడు, అన్నదమ్ములు గెలిచి సంచలనం రేపారు. మరోవైపు కాంగ్రెస్‌ గాలిలో సీనియర్‌ మంత్రులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన కేసీఆర్‌, హరీశ్‌రావు తక్కువ మెజారిటీతో గెలిచారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ గెలుపు ఖరారు కాకముందే.. డీజీపీ అంజనీకుమార్‌తోపాటు పలువురు ఐపీఎస్‌లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌ రాజీనామా చేయకుందే.. ఎన్నికల సంఘం కాంగ్రెస గెలుపును డిక్లేర్‌ చేయకముందే డీజీపీ రేవంత్‌ను కలవడం సంచలనంగా మారింది.

ఈసీకి ఫిర్యాదులు..
ఒక పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్న టీపీసీసీ చీఫ్‌ చేవంత్‌రెడ్డిని రాష్ట్ర పోలీస్‌ బాస్‌ అంజనీకుమార్‌ కలవడంపై విమర్శలు వెల్లువెత్తడంతోపాటు ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతండగానే డీజీపీ రేవంత్‌ను కలవడంపై బీజేపీ అభ్యతరం వ్యక్తం చేసింది. ఎలాంటి హోదాలేని వ్యక్తిని డీజీపీ ఇంటికి వెళ్లి కలవడం ఏంటని ప్రశి‍్నంచింది. ఆయనతోపాటు ఐపీఎస్‌లను తీసుకెళ్లడాన్ని ఆక్షేపించింది. మరోవైపు బీజేపీతోపాటు, బీఆర్‌ఎస్‌ నాయకుల నుంచి ఈసీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ సీఎంగా ఉండగానే డీజీపీ ప్లేట్‌ ఫిరాయించడంపై గులాబీ నేతల అసహనానికి లోనయ్యారు. వెంటనే ఈసీలకు ఫిర్యాదులు చేశారు.

సస్పెన్షన్‌ వేట?
ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా, ఒకవైపు కౌంటింగ్‌ కొనసాగుతుండగా, డీజీపీ అంజనీకుమార్‌ నిబంధనలకు విరుద్ధంగా, కోడ్‌ ఉల‍్లంఘించి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను కలవడంపై ఈసీ స్పందించింది. వెంటనే డీజీపీ అంనీయుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు పీటీఐ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రేవంత్‌ను కలిసినందుకే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అయితే డీజీపీపై సస్పెన్షన్‌ వేటుపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.