Telangana Election Results 2023: పార్టీ మారినవారంతా ఓడితే.. ఆ ఇద్దరు మాత్రం గెలిచారు!

బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి. వివేక్‌ అయితే 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత చేరారు. రాజగోపాల్‌రెడ్డి 2022లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

Written By: Raj Shekar, Updated On : December 3, 2023 4:10 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో సంచలనం నమోదు చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేశారు. వీరందరూ దాదాపుగా ఓడిపోయారు. కేవలం సబితా ఇంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు. భూపాలపెల్లి, పినపాక, కొల్లాపూర్, ఎల్లారెడ్డి నుంచి గెలిచిన వారంతా ఓడిపోయారు. సబితా ఇంద్రారెడ్డి మాత్రమే విజయం సాధిచారు. అయితే ఇలాగే ఎన్నికల ముందు పార్టీ మారిన ఇద్దరు సీనియర్‌ నాయకులు ఘన విజయం సాధించారు. వారే వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి..
బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి. వివేక్‌ అయితే 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత చేరారు. రాజగోపాల్‌రెడ్డి 2022లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ బలహీనపడడం, సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించడం వంటి పరిణామాలతోపాటు, లిక్కర్‌ కేసులో కవితను అరెస్ట్‌ చేయకపోవడంతో బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన ప్రజల్లో కలిగింది. దీంతో కోటీశ్వరులైన ఈ ఇద్దరు నేతలు చివరి నిమిషంలో బీజేపీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. టిక్కెట్ల ప్రకటనకు రెండు మూడు రోజుల ముందు కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకున్నారు.

ఘన విజయం..
వివేక్‌ వెంకటస్వామి ఎస్సీ నియోజవర్గమైన చెన్నూర్‌ నుంచి పోటీ చేశారు. రాజగోపాలరెడ్డి తన సొంత నియోజకవర్గం మునుగోడు బరిలో నిలిచారు. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలను ప్రజలు భారీ మెజారిటీతీ గెలిపించారు. చెన్నూర్‌లో వివేక్‌ 37 వేల మెజారిటీతో విజయం సాధించగా, మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి కూడా 25 వేలు మోజారిటీతో విజయం సాధించారు.