BJP In Telangana : తెలంగాణలో బీజేపీ అతివిశ్వాసం కొంప ముంచుతుందా?

BJP In Telangana : అక్కడున్నది కేసీఆర్.. తిమ్మినబమ్మిని చేసి రాజకీయాన్ని ఒక్కరోజులో మార్చగల నేర్పరి. వైఎస్ఆర్ బతికున్న రోజుల్లో అసలు తెలంగాణ వాదమే లేదు. కానీ ఆయన మరణించాక ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ ఉద్యమాన్ని రగిలించి నాటి కాంగ్రెస్ నాయకత్వ లోపాన్ని క్యాష్ చేసుకొని తెలంగాణ సాధించారు. సమకాలీన రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్. ఆయనతో గేమ్స్ జాగ్రత్తగా ఆడాలి. 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు లాంటివారినే ఒక్క ‘ఓటుకు నోటు’తో తెలంగాణ నుంచి […]

Written By: NARESH, Updated On : November 5, 2021 1:50 pm
Follow us on

BJP In Telangana : అక్కడున్నది కేసీఆర్.. తిమ్మినబమ్మిని చేసి రాజకీయాన్ని ఒక్కరోజులో మార్చగల నేర్పరి. వైఎస్ఆర్ బతికున్న రోజుల్లో అసలు తెలంగాణ వాదమే లేదు. కానీ ఆయన మరణించాక ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ ఉద్యమాన్ని రగిలించి నాటి కాంగ్రెస్ నాయకత్వ లోపాన్ని క్యాష్ చేసుకొని తెలంగాణ సాధించారు. సమకాలీన రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్. ఆయనతో గేమ్స్ జాగ్రత్తగా ఆడాలి. 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు లాంటివారినే ఒక్క ‘ఓటుకు నోటు’తో తెలంగాణ నుంచి తరిమికొట్టేసిన మేధావి కేసీఆర్. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకొని 2023 ఎన్నికల్లో అధికారం సాధించేలా పయనించాలి.. లేదంటే హుజూరాబాద్ గెలుపుతో వచ్చిన ఫలితం నిష్పలం అవుతుంది. తెలంగాణ బీజేపీకి గర్వభంగం అవుతుంది.

KCR-BJP

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆనందంగా ఉన్నాయి. కేసీఆర్ పని అయిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఈటల రాజేందర్ లాంటి నేతలు విమర్శలు చేస్తున్నారు. ‘ఈ విజయం టీఆర్ఎస్ పతనానికి నాంది’ అని కిషన్ రెడ్డి అయితే సగర్వంగా ప్రకటించారు కూడా..

ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ కేసీఆర్ లాంటి గండరగండరుడి నుంచి పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

2014కు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్ లో మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తి వచ్చేసింది. గెలిచేది మేమే అని గర్వం వచ్చేసింది. ఎన్నికలను లైట్ తీసుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి ఇదే వైసీపీ ఓడిపోయింది. నాడు ఓడిపోయిన టీడీపీ పొత్తు పెట్టుకొని బీజేపీ, జనసేనతో కలిసి వ్యూహాత్మకంగా గెలిచింది. ఎదురుదెబ్బలను గెలుపునకు సోపానంగా మలుచుకుంది. జగన్ ను చిత్తు చేసింది.

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో జనాలు సంబరాలు చేసుకోవడం ద్వారా భారీ స్థాయిలో కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని రుజువైంది. దీన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలానే ఆరంభశూరత్వంతో డైలాగులు పలికి విస్మరిస్తే మొదటికే మోసం. అయినా ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. బీజేపీ గెలుపు సంబరంతో రిలాక్స్ అయితే మాత్రం దెబ్బకొట్టడానికి కేసీఆర్ ఎప్పుడూ రెడీగా ఉంటాడు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఇదే బీజేపీని నాగార్జున సాగర్ తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ చిత్తుగా ఓడించాడు. బీజేపీ ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటునుకూడా కైవసం చేసుకున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఎవరిని ఓడించాలన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. ప్రజల మైండ్ సెట్ ను మార్చగల సామర్థ్యం ఆయనకుంది.

రాజకీయాలను ఒక్కరోజులోనే మార్చి తనవైపు తిప్పుకోవడంలో కేసీఆర్ ది అందెవేసిన చేయి. దిశా హత్యాచారం విషయంలో జాతీయ స్థాయిలో కేసీఆర్ ను అన్ని మీడియా, రాజకీయ నేతలు తిట్టారు.దిశా నిందితుల ఎన్ కౌంటర్ తో తిట్టిన వారే కేసీఆర్ ను పొగిడారు. పూలు వేశారు. గట్స్ అంటే కేసీఆర్ దేనన్నారు. కేసీఆర్ లాంటి రాజకీయ అవకాశవాదిని తక్కువ అంచనావేయడం వల్ల తెలంగాణలో బీజేపీకి దెబ్బపడుతుంది. ముందుగా బీజేపీ ఈ రెండున్నరేళ్లలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు.. ఈటల లాంటి బలమైన నేతలను తయారు చేసుకునేందుకు వెచ్చించాలి. ప్రయత్నాలు రెట్టింపు చేయాలి. అప్పుడే కేసీఆర్ ను సమర్థంగా ఎదుర్కోగలరు.. ఓడించగలరు.