Homeఆంధ్రప్రదేశ్‌TDP- Janasena: ఎమ్మెల్సీ విజయాన్ని తలకెక్కించుకున్న టీడీపీ.. జనసేనపై మారుతున్న స్ట్రాటజీ

TDP- Janasena: ఎమ్మెల్సీ విజయాన్ని తలకెక్కించుకున్న టీడీపీ.. జనసేనపై మారుతున్న స్ట్రాటజీ

TDP- Janasena
pawan kalyan- chandrababu

TDP- Janasena: ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ మనసు మారుతోందా? ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబుకు వైట్ వాష్ చేస్తున్నాయా?సొంతంగా గెలిచే అవకాశాలున్నందున జనసేనతో సంబంధాలు వద్దంటున్నారా? ఆ పార్టీకి పదికి మించి సీట్లు కేటాయించవద్దన్న కొత్త వాదనను తెరపైకి తెచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు మూడింటిని కైవసం చేసుకోవడంతో టీడీపీలో మరో రకమైన వైబ్రేషన్ ప్రారంభమైందన్నవార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ ఏ పార్టీకి సపోర్టు చేయ్యలేదు. కానీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాత్రమే పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి ధీటుగా టీడీపీ అభ్యర్థులను నిలబెట్టడంతో జన సైనికులు ఆ పార్టీకి ఓటువేశారు. టీడీపీ విజయానికి కారణమయ్యారు. కానీ ఏరు దాటి ఒడ్డు తగిలినట్టు.. అదేదో సొంత విజయమని భ్రమించి టీడీపీ కొత్త సమీకరణలకు తెరతీసినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే చంద్రబాబుతో చాలా జాగ్రత్తగా ఉండాలని పవన్ కు సొంత పార్టీ నాయకులు, కాపు సంక్షేమ నేతలు ఇది వరకే హెచ్చరించారు. వాస్తవానికి పవన్ అవసరం చంద్రబాబుకే ఎక్కువ ఉంది. ఇప్పటివరకూ అదే కొనసాగింది. అయితే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వరించేసరికి టీడీపీ శ్రేణులకు కాలూ చేయి ఆడడం లేదు. చాన్నాళ్లకు విజయం పలకరించేసరికి నోటి మాట రావడం లేదు. కానీ చాలాదూరం ఆలోచించడం ప్రారంభించారు. పవన్ అవసరం లేకుండా ముందుకెళదామని ఆలోచన చేస్తున్నారు. అటు ఎల్లో మీడియా సైతం పవన్ కు అంత సీన్ లేదన్నట్టు ప్రచారం ప్రారంభించింది. అలూ లేదు చూలు లేదు అన్నట్టు పొత్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు కానీ.. పవన్ కు 30 సీట్లు అవసరం లేదని కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు.

TDP- Janasena
pawan kalyan- chandrababu

ఎమ్మెల్సీ విజయాన్ని టీడీపీ నేతలు తలకెక్కించుకున్నారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 108 సీట్లలో సొంతగా అధికారంలోకి వచ్చేశామని భ్రమపడుతున్నారు. ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండే మిగులుతాయ‌ని, మూడో పార్టీకి చోటు వుండ‌ద‌ని చంద్రబాబు మనసు మార్చేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం టీడీపీ మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేస్తోంది. జ‌న‌సేన‌ను విడిపించుకోడానికి ఈ ఫ‌లితాలు దోహ‌దం చేస్తున్నాయని టీడీపీ నేత‌లు అంటుండ‌డం గ‌మ‌నార్హం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version