TDP: దాదాపు 40 ఏళ్ల చరిత్ర .. పలు దఫాల పాటు అధికారం.. ఎందరో నాయకులకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు ఆ పార్టీ తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతోందా..? నిధుల లేమితో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదా..? అన్న చర్చ క్యాడర్లో సాగుతోంది. నిధుల లేమితో టీడీపీ సతమతమవుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉంది..వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీంత పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరు కొందరు కింది స్థాయి నాయకులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దారులు వెతుక్కుంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఆ తరువాత 2004, 2009లో పరాజయం చవి చూసింది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో పార్టీ ఇంత స్థాయికి దిగజారలేదు. ఆ సమయంలో పార్టీని నడిపించేందుకు కొందరు పారిశ్రామి వేత్తలు, సినీ రంగానికి చెందిన వారు నిధులు అందించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచివిడిపోయిన తరువాత మొదటిసారిగా అధికారం చేపట్టిన చంద్రబాబు మరోసారి తమదే విజయం అన్నట్లుగా భావించారు. దీంతో ఫ్యూచర్ కోసం నిధులను సమకూర్చలేదని తెలుస్తోంది.
ఊహించని పరిణామాల మధ్య 2019లో అధికారం కోల్పోయిననప్పటి నుంచి పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీంతో టీడీపీని ఆదరించేవారు సైతం దూరమవుతున్నారు. అంతకుముందు టీడీపీ అధికారంలో లేకపోయినా ఎంతో కొంత ఆదరించడంతో పాటు చంద్రబాబు పై ఉన్ననమ్మకంతో భారీగా నిధులు వచ్చేవి. అంతేకాకుండా తమ పార్టీ అధికారంలో లేకపోయినా నాయకులు పార్టీలోనే కొనసాగేవారు. కానీ ఇప్పడు రాష్ట్రంలో టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కొందరు భయంతో.. మరికొందరు భద్రతతో పార్టీని వీడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీకి సీనియర్ నేతలు తప్ప ఆయా నియోజకవర్గాల్లో సరైన కేడర్ లేదనే తెలుస్తోంది. ఈ ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందా..? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇక చంద్రబాబు తరువాత పార్టీలో అసలైన నాయకుడు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తారా..? లేదా..? అన్నదీ సందిగ్ధంగానే ఉంది.దీంతో కొందరు పారిశ్రామిక వేత్తలు టీడీపీని నమ్ముకుంటే ఏం లాభం..? అన్నట్లుగా ఆలోచిస్తున్నారట. అయితే తమ ప్రాబల్యం చాటుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా ఆ పార్టీ టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడంతో సైకిల్ పార్టీకి సపోర్టు ఇచ్చేవారు దూరమవుతున్నారు.
రెండేళ్లుగా టీడీపీకి వెన్నుముకగా భారీ వ్యాపారాలున్న నేతలపై వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. దీంతో ఆ నేతలు పార్టీకి ఫండ్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా టీడీపీ ఖజానా ఖాళీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖజానా నింపేందుకు పార్టీ నేతలు శయశక్తులా శ్రమిస్తున్నారని అంటున్నారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతినడంతో పాటు పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఖజానా నిండడం లేదు. ఈ కారణంగా పార్టీ తరుపున కొన్ని రోజులుగా సరైన కార్యక్రమం నిర్వహించడం లేదని కొందరు వాపోతున్నారు.
ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీకి చెందిన నాయకుల వ్యాపారాలు ఇప్పటికే దివాలా తీస్తున్నాయి. మరికొందరు సైకిల్ పార్టీని నమ్ముకొని ఉన్నా వారిపై అధికార వైసీపీ ఏదోరకంగా దాడులు పాల్పడుతుండడంతో పార్టీకి నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అయితే వచ్చే ఎన్నికల వరకు పార్టీ అధినేత చంద్రబాబు ఖజానా నింపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.