https://oktelugu.com/

ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు.. బాలయ్య హాట్ కామెంట్స్

నందమూరి ఇంట మళ్లీ పాలి‘ట్రిక్స్’ మొదలయ్యాయి. ఏపీలో టీడీపీ కుదేలు కావడం.. చంద్రబాబు వయసు అయిపోవడంతో భావి టీడీపీ వారసుడు ఎవరన్న దానిపై ఆసక్తికర ప్రశ్నకు అగ్ర హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలక్రిష్ణ పుట్టినరోజు నిన్న వైభవంగా సాగింది. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతోనూ తన అనుభవాలను నిన్న రాత్రి న్యూస్ చానెల్స్ తో పంచుకున్నారు. సినిమాల నుంచి రాజకీయాల దాకా అనేక అంశాలపై బాలయ్య […]

Written By: , Updated On : June 11, 2021 / 08:46 AM IST
Follow us on

నందమూరి ఇంట మళ్లీ పాలి‘ట్రిక్స్’ మొదలయ్యాయి. ఏపీలో టీడీపీ కుదేలు కావడం.. చంద్రబాబు వయసు అయిపోవడంతో భావి టీడీపీ వారసుడు ఎవరన్న దానిపై ఆసక్తికర ప్రశ్నకు అగ్ర హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలక్రిష్ణ పుట్టినరోజు నిన్న వైభవంగా సాగింది. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతోనూ తన అనుభవాలను నిన్న రాత్రి న్యూస్ చానెల్స్ తో పంచుకున్నారు. సినిమాల నుంచి రాజకీయాల దాకా అనేక అంశాలపై బాలయ్య పుట్టినరోజున మనసు విప్పి మాట్లాడారు.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై బాలక్రిష్ణ చేసిన ఆసక్తికరమైన కామెంట్స్ హాట్ కామెంట్స్ అయ్యాయి. ఈ సందర్భంగా టీవీ యాంకర్ బాలయ్యపై పాలిటిక్స్ సంధించారు. టీడీపీ పగ్గాలను చంద్రబాబు బాలక్రిష్ణ చేతిలో పెడితే స్వీకరిస్తారా? ఆ దిశగా బాలయ్య ఆలోచించారా? అని ప్రశ్నించాడు. దీనికి ముక్కుసూటిగా బాలయ్య స్పందించాడు.

తాను ఎప్పుడూ పార్టీ పగ్గాలు ఇవ్వమని చంద్రబాబుని కోరలేదని వెల్లడించారు. అలా అడిగే వ్యక్తిత్వం తనది కాదని వ్యాఖ్యానించారు. నిజంగా అలాంటి సందర్భం వస్తే పార్టీ పగ్గాలు తీసుకోవడానికి వెనుకాడనని.. ఆ సమర్థత తనకు ఉందని.. కానీ అందుకు బలమైన సందర్భం రావాలని అన్నారు. అంటే చంద్రబాబు పార్టీ పగ్గాలు ఇస్తే తీసుకోవడానికి రెడీ అని బాలయ్య చెప్పకనే చెప్పారని చెప్పొచ్చు.

ఇక టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ వస్తోందని.. దీనిపై ఏమంటారని జర్నలిస్ట్ ప్రశ్నించారు.దీనికి బాలయ్య సూటిగా సమాధానం చెప్పలేదు. ‘ఫలానా వారు పార్టీ పగ్గాలు తీసుకోవాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదని..సినిమా హీరో కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోవాలని అనుకోవడం సబబు కాదని బాలయ్య అన్నారు.

అయితే ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు తీసుకుంటే పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని జర్నలిస్ట్ మరో ప్రశ్న సంధించగా.. చాలా సేపు ఆగి ఆలోచించిన బాలయ్య.. ‘ఒక్కోసారి ప్లస్ కావచ్చు.. మరోసారి మైనస్ కావచ్చు.. ముందు ప్లస్ అయ్యి ఆ తర్వాత మైనస్ కావద్దు.. మైనస్ అయ్యి తర్వాత పస్లస్ అయితే మంచిది కాదు ’ అంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో బాలయ్య కు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం సుతారం ఇష్టం లేదని అర్థమైంది.

I'm not bother about Jr NTR's political entry: Nandamuri Balakrishna - TV9