స్థానిక ఎన్నికలు… చేతులెత్తిసిన టిడిపి!

స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరుగుతూ ఉండడం, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు కూడా నెలకొండడంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిక్కుతోచని పరిస్థితులలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. ఒక వంక అనేకమంది ప్రముఖ నాయకులు అధికార పక్షం నుండి వత్తిడులకు తట్టుకోలేదు పార్టీ మారుతూ ఉంటె, మరో వంక పలువురు సీనియర్ నేతలే అధికార పక్షపు దౌర్జన్యాలను, పోలీసుల వేధింపులను తట్టుకోలేక పోటీకి దూరంగా ఉంటూ ఉండడంతో టిడిపి పోలింగ్ […]

Written By: Neelambaram, Updated On : March 15, 2020 1:46 pm
Follow us on

స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరుగుతూ ఉండడం, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు కూడా నెలకొండడంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిక్కుతోచని పరిస్థితులలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.

ఒక వంక అనేకమంది ప్రముఖ నాయకులు అధికార పక్షం నుండి వత్తిడులకు తట్టుకోలేదు పార్టీ మారుతూ ఉంటె, మరో వంక పలువురు సీనియర్ నేతలే అధికార పక్షపు దౌర్జన్యాలను, పోలీసుల వేధింపులను తట్టుకోలేక పోటీకి దూరంగా ఉంటూ ఉండడంతో టిడిపి పోలింగ్ కు ముందుగానే చేతులు ఈట్టివేసిన్నట్లు అవుతున్నది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక పోవడం, ఆయన అధికారమలోకి రాగానే అభివృద్ధి పనులు అన్ని స్తంభించి పోవడం, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దారుణంగా పడిపోతూ ఉండడంతో అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజులలోనే తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటు ఉండడంతో జగన్ ను ఎన్నుకున్న ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారనే ఒక విధమైన అపోహలో టిడిపి నేతలు చిక్కుకు పోయారు.

అయితే వాయిదా వేసే అవకాశం ఉన్నప్పటికీ హడావుడిగా, తగు వ్యవధి లేకుండా అన్ని ఎన్నికలను ఒకేసారి జరుపుతూ ఉండడంతో టిడిపి నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జగన్ పాలనా పట్ల ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజల తమ ఆగ్రవేశాలను వ్యక్తం చేస్తారని ఎదురు చూస్త్తూ ఉన్నారు. అయితే తీరా ఎన్నికలు జరిగే సరికి ప్రతిపక్షాలు అస్త్రసన్యాసం జరిపినట్లు అవుతున్నది.

వాస్తవానికి ఇప్పటిలో జగన్ ను తాము ఎదుర్కోలేమని దాదాపు టిడిపి నేతలంతా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రజలు విసుగుచెంది , తిరగబడే వరకు మౌనంగా ఉంటె మంచిదని కూడా భావిస్తున్నారు. కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే తన ఉనికిని ప్రదర్శిస్తూ ఉండాలని తాపత్రయ పడుతున్నారు. దానితో జగన్ ఎత్తుగడల ముందు తప్పుకోలేక పోతున్నారు.

ఒక వంక డిజిపి హైకోర్టు లో రోజంతా అనిలబడి, సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడినా, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆత్మరక్షణలో పడినా అధికార పార్టీ మాత్రం ఏమాత్రం బెదిరిపోవడం లేదు. జగన్, ఆయన సహచరులతో కనిపిస్తున్న మనోనిబ్బరం టిడిపి నేతలను కలవారానికి గురిచేస్తున్నది. మీడియా దృష్టి ఆకర్షించడం కోసం మొక్కుబడిగా నిరసనలు వ్యక్తం చేయడమే తప్పా ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించే సాహసం మాత్రం చేయలేక పోతున్నారు.